Stock Market Today, 19 May 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 19 పాయింట్లు లేదా 0.10 శాతం గ్రీన్ కలర్‌లో 18,197 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: NTPC, జొమాటో, JSW స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఢిల్లీవేరి, బంధన్ బ్యాంక్. ఈ షేర్లపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండిగో: ఏవియేషన్ దిగ్గజం ఇండిగో జనవరి-మార్చి కాలంలో రూ. 919 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో ఇది రూ. 1,682 కోట్ల నష్టంతో ఉంది. మార్చి త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 76% పెరిగి రూ. 14,160 కోట్లకు చేరుకుంది.
బాటా ఇండియా: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బాటా ఇండియా 4% స్వతంత్ర నికర లాభం రూ. 65 కోట్లకు పెరిగింది. సమీక్ష కాల త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 17% పెరిగి రూ. 778 కోట్లకు చేరుకుంది.
టాటా ఎల్‌క్సీ: 2022-23 నాలుగో త్రైమాసికంలో టాటా ఎల్‌క్సీకి రూ. 201 కోట్ల నికర లాభం మిగిలింది. గత ఏడాది ఇదే కాలంలోని లాభం రూ. 160 కోట్లతో పోలిస్తే ఇది 25% వృద్ధి. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 23% పెరిగి రూ. 838 కోట్లకు చేరుకుంది
యునైటెడ్ స్పిరిట్స్: Q4FY23లో యునైటెడ్ స్పిరిట్స్‌కు నికర లాభం రూపంలో రూ. 204 కోట్లు మిగిలింది. గత సంవత్సరం కంటే ఇది 7% వృద్ధి. అయితే, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 25% తగ్గి రూ. 5,783 కోట్లకు పరిమితమైంది.
కంటైనర్ కార్పొరేషన్: నాలుగో త్రైమాసికంలో కంటైనర్ కార్ప్ 8% వృద్ధితో రూ. 278 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలో రూ. 2,166 కోట్ల కార్యకలాపాల ఆదాయం వచ్చింది. ఆదాయంలో ఏడాది ప్రాతిపదికన 6% వృద్ధి కనిపించింది.
GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: జనవరి-మార్చి కాలంలో జీఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ రూ. 390 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,461 కోట్లుగా ఉంది.
PI ఇండస్ట్రీస్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో పీఐ ఇండస్ట్రీస్ రూ. 281 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో రూ. 1,565 కోట్ల ఆదాయం వచ్చింది.
యునో మిండా: నాలుగో త్రైమాసికంలో యూనో మిండా నికర లాభం 26% పెరిగి రూ. 183 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో ఈ కంపెనీ రూ. 2,889 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
గ్లాండ్ ఫార్మా: జనవరి-మార్చి కాలానికి గ్లాండ్ ఫార్మా రూ. 79 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో కంపెనీ ఆదాయం రూ. 785 కోట్లుగా ఉంది.
జెట్ ఎయిర్‌వేస్: నాలుగో త్రైమాసికంలో జెట్ ఎయిర్‌వేస్ నష్టాలు రూ. 55 కోట్లకు తగ్గగా, ఆదాయం 13% పెరిగి రూ. 12.4 కోట్లకు చేరుకుంది.
ఇది కూడా చదవండి: జర్నీ ఇప్పుడు చేయండి, టిక్కెట్ డబ్బులు తర్వాత చెల్లించండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.