Shani Jayanti 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడికి కొన్ని నాలుగు రాశులవారిపై శని అనుగ్రహం ఉంటుంది. మరో రెండు రాశులవారికి కూడా శని జయంతి రోజు మంచి జరుగుతుంది. ముఖ్యంగా  ఈ ఏడాది శని జయంతి నాడు గజకేసరి, శశ యోగం ఏర్పడుతోంది. ఈ యోగంవల్ల కొన్ని రాశులవారికి ఆనందం, శ్రేయస్సు, సంపద పెరుగుదల ఉంటుంది.


మేషరాశి (Aries) 


శని జయంతి రోజున ఈ రాశి వారికి ఐశ్వర్యం కలుగుతుంది. కార్యక్షేత్రంలో పురోగతి ఉంటుంది.మీపై భగవంతుడ అనుగ్రహం ఉంటుంది. అప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 


వృషభ రాశి (Taurus)


వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శని-శుక్రుడి మధ్య స్నేహభావం ఉంటుంది. అందుకే శని అనుగ్రహం వల్ల వృషభ రాశివారు పురోభివృద్ధి పొందుతారు. శుక్రుడు అధిపతిగా ఉన్న రాశిచక్రాలకు శని యోగకారకుడుగా ఉంటాడు. అందుకే వృషభ రాశివారికి శని సంచారం వల్ల హాని జరగదు. 


Also Read:  లోకంలో భార్య-భర్తలు 5 రకాలు- మీ జంట ఇందులో ఏ రకమో చూసుకోండి!


మిథున రాశి (Gemini)


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని జయంతి రోజున ఈ రాశివారికి శుభం జరుగుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ప్రమోషన్ ఉంటుంది.


తులా రాశి (Libra)


తులారాశి వారికి శని మంచి చేస్తుంది. ఎందుకంటే తులారాశికి కూడా శుక్రుడి అనుగ్రహం ఉండడంతో శని కూడా యోగకారకుడు. తులారాశి వారిపై శని చెడు దృష్టి ఉండదు. ముఖ్యంగా శని జయంతి రోజు ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. అన్ని రంగాలలో విజయం సాధిస్తారు.


Also Read: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!


మకర రాశి (Capricorn)


మకర రాశికి అధిపతి శనిదేవుడు. శనికి ఇష్టమైన రాశి కూడా మకరమే. అందుకే ఈ రాశివారిపై శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. పెద్దగా దుష్ఫలితాలు ఉండవు. మకర రాశి వారు ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టరు..వారి కష్టానికి తగిన ఫలితం దక్కించుకుంటారు. 


కుంభ రాశి (Aquaries)


కుంభ రాశిపై కూడా శనిదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఈ రాశివారిపై శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్నా అశుభఫలితాలు తక్కువ శాతమే ఉంటుంది. శని జయంతి రోజు అభిషేకం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.


శని జయంతి నాడు శనిదేవుడి మంత్రాన్ని జపిస్తూ దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు, కష్టాలు తొలగిపోతాయి. అంతేకాదు శని జయంతి రోజున నల్లటి వస్తువులు దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. నల్లని వస్త్రాలు, నల్ల బూట్లు, నువ్వులు, ఇనుము, నువ్వుల నూనె వంటి వస్తువులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని చెబుతారు. 


గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.  ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.