Stock Market Today, 19 July 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 3 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్ కలర్‌లో 19,801 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్: టాటా కమ్యూనికేషన్స్, L&T ఫైనాన్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇవాళ జూన్ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండస్ఇండ్ బ్యాంక్: ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1 FY24 ) ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం 33% పెరిగి రూ. 2,124 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో 28% వృద్ధితో రూ. 12,939 కోట్ల ఆదాయాన్ని బ్యాంక్ ఆర్జించింది.
L&T టెక్: ఎల్ అండ్ టి టెక్నాలజీస్ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ Q1 FY24లో గత ఏడాది కంటే (YoY) 13% పెరిగి రూ. 311 కోట్లుగా నమోదైంది. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 15% వృద్ధితో రూ. 2,301 కోట్లకు చేరుకుంది. QoQలో మాత్రం లాభం 8.5% వరకు, ఆదాయాలు దాదాపు 3% తగ్గాయి
ICICI లాంబార్డ్: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో, ICICI లాంబార్డ్ తన నికర లాభాన్ని గత ఏడాది కంటే 12% పెంచుకుంది, మొత్తం రూ. 390 కోట్లు మిగుల్చుకుంది.
ర్యాలీస్ ఇండియా: ఏస్ ఇన్వెస్టర్ రేఖ ఝున్‌ఝున్‌వాలా బ్లాక్ డీల్స్ ద్వారా రాలీస్ ఇండియాలో 97 లక్షల షేర్లు (దాదాపు 5% స్టేక్) విక్రయించారు. ఒక్కో షేరును రూ. 215 చొప్పున అమ్మి రూ. 208 కోట్లు సంపాదించారు. ప్రమోటర్ కంపెనీ టాటా కెమికల్స్ ఆ షేర్లను కైవసం చేసుకుంది.
అమర రాజా బ్యాటరీస్: క్లారియోస్ ARBL హోల్డింగ్, బ్యాటరీ తయారీ కంపెనీ అమర రాజా బ్యాటరీస్‌లో తనకు ఉన్న మొత్తం వాటాను బల్క్ డీల్స్ ద్వారా విక్రయించింది.
హిమాద్రి స్పెషాలిటీ : 2023-24 తొలి త్రైమాసికంలో హిమాద్రి స్పెషాలిటీ రూ. 86 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 951 కోట్ల ఆదాయం వచ్చింది.
CIE ఆటోమోటివ్: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో CIE ఆటోమోటివ్ 302 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ ఆదాయం రూ. 2,320 కోట్లుగా లెక్క తేలింది.
TV18 బ్రాడ్‌కాస్ట్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో TV18 బ్రాడ్‌కాస్ట్‌కు రూ. 44 కోట్ల నికర లాభం వచ్చింది. మొత్తం రూ. 3,176 కోట్ల ఆదాయం మీద ఆ లాభం సంపాదించింది.
హీరో మోటోకార్ప్: కొత్త Xtreme 200S 4 Valve మోడల్‌ను హీరో మోటోకార్ప్ లాంచ్ చేసింది. తద్వారా, తన ప్రీమియం పోర్ట్‌ఫోలియోను పెంచుకుంది.
ఇది కూడా చదవండి: ఫ్రీలాన్సర్ లేదా కన్సల్టెంట్ కేటగిరీ వేరు, అందరిలా వీళ్ల ఐటీఆర్ ఫైల్ చేయలేరు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial