Stocks to watch today, 19 April 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 12 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 17,709 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, అలోక్ ఇండస్ట్రీస్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


అవలాన్ టెక్నాలజీస్: మంగళవారం ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ తర్వాత, అవలాన్ టెక్నాలజీస్‌లో వాటాను బల్క్ డీల్స్ ద్వారా గోల్డ్‌మన్ సాచ్స్ కొనుగోలు చేసింది.


టాటా కాఫీ: నాలుగో త్రైమాసికంలో, టాటా కాఫీ ఏకీకృత ఆదాయం రూ. 736 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ. 663 కోట్లతో పోలిస్తే ఇది 11% పెరిగింది.


ICICI లాంబార్డ్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 437 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 312 కోట్లతో పోలిస్తే ఇది 40% అధికం.


SBI: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2 బిలియన్‌ డాలర్ల వరకు దీర్ఘకాలిక రుణాల సేకరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


పిరమాల్ ఫార్మా: US FDA, పిరమల్ ఫార్మా సెల్లర్స్‌విల్లే (Sellersville) తయారీ ఫ్లాంటుకు ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్ (EIR) జారీ చేసింది. దీంతో తనిఖీ విజయవంతంగా ముగిసింది.


బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,500 కోట్ల రూపాయల వరకు మూలధన సమీకరణకు బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


జిందాల్ స్టెయిన్‌లెస్: ఈ ఏడాది మే 1 నుంచి అమలులోకి వచ్చేలా, 5 సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా అభ్యుదయ్ జిందాల్‌ను తిరిగి నియమించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.


ప్రెస్టీజ్ ఎస్టేట్స్: తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ప్రెస్టీజ్ ఎక్సోరా బిజినెస్ పార్క్స్ ద్వారా దశన్య టెక్ పార్క్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51% వాటాను ప్రెస్టీజ్ ఎస్టేట్స్ కొనుగోలు చేసింది.


జైడస్ లైఫ్ సైన్సెస్: ఎస్ట్రాడియోల్ ట్రాన్స్‌డెర్మల్ సిస్టం తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) నుంచి జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌కు తుది ఆమోదం లభించింది.


మహీంద్ర అండ్ మహీంద్ర: 2027 నాటికి, ప్రయాణీకుల వాహనాల్లో 20-30% వరకు ఎలక్ట్రిక్‌ వాహనాలుగా ఉత్పత్తి చేస్తామని ఈ ఆటోమొబైల్‌ కంపెనీ ప్రకటించింది.


పిడిలైట్ ఇండస్ట్రీస్‌: బేసిక్ అడ్హెసివ్స్‌ నుంచి టెక్నాలజీ, డిజైన్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, డొమైన్ నేమ్‌, ట్రేడ్ డ్రెస్ మొదలైన ఆస్తుల కొనుగోలు కోసం పిడిలైట్ ఇండస్ట్రీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.