Stock Market Today, 18 October 2023: మూడు రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ ఈక్విటీలు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బలమైన కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై ఆశలు, ఇజ్రాయెల్-గాజా వివాదంపై ఆందోళనలను తగ్గించాయి.


US స్టాక్స్ మిశ్రమం
US ట్రెజరీ ఈల్డ్స్‌ పెరగడంతో మంగళవారం డో జోన్స్‌, ఎస్ & పి 500 దాదాపు ఫ్లాట్‌గా ఉండగా నాస్‌డాక్ నష్టాల్లో ముగిసింది. చైనాకు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ల రవాణాను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు అమెరికా చెప్పడంతో చిప్‌మేకర్ల షేర్లు పడిపోయాయి.


ఆసియా షేర్లు పతనం
US ఈక్విటీలు కష్టపడటం, బాండ్‌ రేట్లు క్షీణించడంతో ఆసియా స్టాక్స్‌ పతనమయ్యాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మరింత ముదరడంతో చమురు ధర పెరిగింది.


ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్‌ కలర్‌లో  19,795 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: విప్రో, LTIMindtree, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్, ZEE. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


బజాజ్ ఫైనాన్స్: సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ కన్సాలిడేటెడ్ నెట్‌ ప్రాఫిట్‌లో 28% వృద్ధిని నమోదు చేసి, రూ. 3,551 కోట్లకు చేరుకుంది. ఇది మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉంది.


ICICI ప్రు లైఫ్: Q2 FY24లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్ స్టాండలోన్ నెట్‌ ప్రాఫిట్‌ ఏడాది ప్రాతిపదికన (YoY) 23% పెరిగి రూ.244 కోట్లకు చేరుకుంది.


హడ్కో: ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా హడ్కోలో 7% స్టేక్‌ను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆఫర్ ఫ్లోర్ ప్రైస్‌ను ఒక్కో షేరుకు రూ.79గా ఖరారు చేసింది.


L&T టెక్: మిడ్-టైర్ ఐటీ కంపెనీ  L&T టెక్, జులై-సెప్టెంబర్‌ కాలంలో ఏకీకృత నికర లాభంలో 5% వృద్ధితో రూ.315 కోట్లను మిగుల్చుకుంది.


CIE ఆటోమోటివ్: సెప్టెంబర్ క్వార్టర్‌లో CIE ఆటోమోటివ్ నికర లాభం రెండింతలు పెరిగి రూ.375 కోట్లకు చేరుకుంది.


ICICI బ్యాంక్, కోటక్ బ్యాంక్: నిబంధనలను పాటించనందుకు ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్‌ మీద రిజర్వ్ బ్యాంక్ పెనాల్టీ విధించింది.


IRCTC: ప్రయాణికులు ముందస్తుగా ఆర్డర్ చేసిన భోజనాలను (pre ordered meals) డెలివరీ చేసేందుకు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ మంగళవారం జొమాటోతో  ఒప్పందం కుదుర్చుకుంది.


IDFC: IDFC ఫస్ట్ బ్యాంక్‌లో IDFC విలీన ప్రణాళికకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది.


మజాగాన్ డాక్‌: ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ఒక శిక్షణ నౌక నిర్మాణం, డెలివరీ కోసం మజాగాన్ డాక్‌తో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఒక్క ఏడాదిలో ₹లక్షను దాదాపు ₹5 లక్షలు చేసిన మల్టీబ్యాగర్‌, ఆరు నెలల్లోనే డబ్బులు డబుల్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial