Stock Market News in Telugu: ఆదాయాల పరంగా చిన్న కంపెనీ అయిన ఒక ఇంజినీరింగ్ కంపెనీ, తన పెట్టుబడిదార్లకు పెద్ద మొత్తంలో లాభాలు సంపాదించి పెడుతోంది. కేవలం ఏడాది కాలంలోనే మూడింతలకు పైగా లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించింది.
పవర్, మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ఇంటెగ్రా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ (Integra Engineering India Ltd) కంపెనీ షేర్లు మహా జోరు మీద ఉన్నాయి. ఈ రోజు (మంగళవారం, 17 అక్టోబర్ 2023) మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఈ కంపెనీ షేర్ ప్రైస్ దాదాపు 39 రూపాయలు లేదా 15% పెరిగింది. ఈ రోజు ఇంట్రాడే-హై రూ. 308 వద్ద 52-వారాల కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ స్క్రిప్ 52-వారాల కనిష్టం రూ. 58.
నిన్న (సోమవారం) ఈ షేర్లు 2.34 శాతం క్షీణించినా, అంతకముందు సెషన్ శుక్రవారం రోజున 20 శాతం లాభపడ్డాయి.
ఇంటెగ్రా ఇంజినీరింగ్ ఇండియాను 1987లో స్థాపించారు. విద్యుత్, రవాణా రంగాల కోసం ప్రత్యేక ఉత్పత్తులను ఇది తయారు చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 1,000 కోట్లు దాటింది.
స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్
BSEలో లిస్ట్ అయిన ఇంటెగ్రా ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ స్టాక్, షార్ట్ టర్న్ టు లాంగ్ టర్మ్‌లో అద్భుతమైన లాభాలను అందించింది. గత ఒక ఏడాది కాలంలో (గత 12 నెలల్లో) దాదాపు 387% రాబడిని కళ్ల ముందుకు తెచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) 228% మేర పెరిగింది. గత ఆరు నెలల్లోనే దాదాపు 122% లాభాలతో డబ్బుల్ని డబుల్ చేసింది. ఇది గత నెల రోజుల్లో 28% జంప్ చేసింది. కేవలం గత 5 ట్రేడింగ్ సెషన్లలోనే 31% ర్యాలీ చేసింది. గత ఐదు సంవత్సరాల్లో 550% స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చింది.
లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఎంత లాభం వచ్చింది?
ఇంటెగ్రా ఇంజినీరింగ్ ఇండియా స్టాక్‌లో సరిగ్గా ఏడాది క్రితం ఎవరైనా లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే, ఈ రోజు అతని పెట్టుబడి మొత్తం రూ. 4 లక్షల 87 వేలు (దాదాపు రూ.5 లక్షలు) అయి ఉండేది. ఆరు నెలల క్రితం రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఒక లక్ష 22 వేలు లాభం వచ్చి ఉండేది. అయితే గురువారం ఎవరైనా రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.లక్షకు బదులు రూ.లక్ష 20వేలు వచ్చేవి. ఇంటెగ్రా ఇంజినీరింగ్ ఇండియా షేర్లలో గత బుధవారం ఎవరైనా రూ. 1,00,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం ఇప్పటికి రూ. 1,31,000గా మారి ఉండేవి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌స్మిత్ మెచ్చిన స్టాక్స్ ఇవి, 'బయ్' పాయింట్‌కు దగ్గర్లో ఉన్నాయి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial