Stock Market Today, 17 July 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.10 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 18 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,636 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ Q1 రిజల్ట్స్‌: HDFC బ్యాంక్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, టాటా ఎల్‌క్సీ ఇవాళ జూన్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్‌ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


డి-మార్ట్: అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్, 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆదాయంలో రెండంకెల వృద్ధిని సాధించినప్పటికీ, నికర లాభం కేవలం 2% పెరిగి రూ. 695 కోట్లకు చేరుకుంది.


M&M: లైట్ కమర్షియల్ వెహికల్స్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్, ట్రాక్టర్‌లు సహా అనేక సెగ్మెంట్ల వాహనాలను కవర్ చేసే ఎలక్ట్రిక్ & కనెక్టెడ్‌ వెహికల్ పోర్ట్‌ఫోలియో కోసం NXPతో మహీంద్ర & మహీంద్ర యుటిలిటీ వెహికల్స్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


CCL ప్రొడక్ట్స్‌: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో CCL ప్రొడక్ట్స్ 61 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ. 655 కోట్ల ఆదాయం వచ్చింది.


GTPL హాత్‌వే: 2023-24 తొలి త్రైమాసికంలో GTPL హాత్‌వే నికర లాభం 17% క్షీణించి దాదాపు రూ. 36 కోట్లకు చేరుకోగా, రాబడులు 23% పెరిగి రూ. 774 కోట్లకు చేరుకున్నాయి.


JSW ఎనర్జీ: Q1 FY24లో JSW ఎనర్జీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 48% పైగా తగ్గింది, రూ. 290 కోట్లకు చేరుకుంది.


లుపిన్: క్లార్పోమేజైన్‌ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్‌లను అమెరికాలో మార్కెట్ చేయడానికి కోసం లుపిన్ అనుబంధ సంస్థ పెట్టుకున్న కొత్త డ్రగ్ అప్లికేషన్‌కు USFDA నుంచి ఆమోదం లభించింది.


నెస్లే: ముందాంబలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెస్లేకు (ఇండియా) సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.


కాంకర్: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (CONCOR) డెరివేటివ్స్ సెగ్మెంట్ నుంచి తొలగిస్తారు, ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుంచి అమలులోకి వస్తుంది.


పవర్‌ గ్రిడ్‌: రూ. 4,067 కోట్ల అంచనా వ్యయంతో అడ్వాన్స్‌డ్‌ మీటరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పెట్టుబడులు పెట్టేందుకు పవర్‌ గ్రిడ్ బోర్డు ఆమోదించింది.


ఆర్తి డ్రగ్స్: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించేందుకు ఆర్తి డ్రగ్స్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 21న సమావేశం కానుంది.


జస్ట్‌ డయల్: జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 83 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది కాలంలో రూ. 48 కోట్ల నష్టం వచ్చింది. కార్యకలాపాల ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే ఈసారి 33% పెరిగి రూ. 247 కోట్లకు చేరుకుంది.


ఇది కూడా చదవండి: రిస్క్‌ లేని ఇన్వెస్ట్‌మెంట్‌ + రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ - ఈ స్కీమ్స్‌ ట్రై చేయొచ్చు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial