Stock Market Today, 13 September 2023: నిఫ్టీ 50 ఇండెక్స్‌ చారిత్రక 20 వేల మార్కును తాకిన తర్వాత, ఈక్విటీ మార్కెట్ మంగళవారం కొంత ప్రాఫిట్ బుకింగ్‌ను చూసింది. ముఖ్యంగా మిడ్ & స్మాల్ క్యాప్ స్పేస్‌లో అమ్మకాలు జరిగాయి. ఆగస్టులో CPI ద్రవ్యోల్బణం 6.83%కు దిగి వచ్చింది. ఈ డేటాకు మార్కెట్లు ప్రతిస్పందిస్తాయి.


US స్టాక్స్ స్లిప్
బలహీనమైన అంచనాలు, పెరుగుతున్న చమురు ధరలు కలిసి ఈ వారం కీలకమైన ద్రవ్యోల్బణ రీడింగ్స్‌పై ఆందోళనలు పెంచాయి. దీంతో ఒరాకిల్ షేర్లు 13% పైగా పడిపోయాయి, వాల్ స్ట్రీట్ స్టాక్స్ మంగళవారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి.


ఆసియా షేర్లు మిశ్రమం
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సైకిల్‌కు దారి చూపే US ద్రవ్యోల్బణం డేటా ఈ రోజు రిలీజ్‌ అవుతుంది. దీంతో ఆసియా ఈక్విటీలు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ప్రపంచ సరఫరాల్లో ఒడుదొడుకుల వల్ల ముడి చమురు రేట్లు 10 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. 


గిఫ్ట్‌ నిఫ్టీ
ఇవాళ ఉదయం 7.55 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 43.5 పాయింట్లు లేదా 0.22 శాతం గ్రీన్‌ కలర్‌లో 20,073 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


వేదాంత: గత వారం వేదాంత రిసోర్సెస్‌కు చేతికి తిరిగి వచ్చిన కొంకోలా కాపర్ మైన్స్‌ను, ఇండియన్‌ లిస్టెడ్‌ గ్రూప్‌లోని వేదాంతలోకి "సరైన వాల్యుయేషన్‌"లో తీసుకువస్తామని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్ అగర్వాల్ చెప్పారు.


KEC ఇంటర్నేషనల్: RPG గ్రూప్ కంపెనీ అయిన KEC ఇంటర్నేషనల్, తన వివిధ వ్యాపారాలకు సంబంధించి రూ. 1,012 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లు పొందింది. 


అవెన్యూ సూపర్‌మార్ట్స్: డీమార్ట్‌ బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్, మంగళవారం, తమిళనాడులోని పెరుంగుడిలో కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న మొత్తం స్టోర్ల సంఖ్య 334కి చేరింది.


కోల్ ఇండియా: పర్యావరణ అనుకూల బొగ్గు రవాణాను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా, 61 ఫస్ట్-మైల్ కనెక్టివిటీ (FMC) ప్రాజెక్టులపై రాబోయే కొన్ని సంవత్సరాల్లో సుమారు రూ. 24,750 కోట్ల మూలధన పెట్టుబడికి కోల్ ఇండియా లిమిటెడ్ ప్లాన్‌ చేసింది.


పేటీఎం: సమీప భవిష్యత్తులో రుణాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం పేటీఎంకు రాదని, స్థిరమైన ఫ్రీ క్యాష్‌ ఫ్లోను సాధిస్తామని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తెలిపారు.


గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా: గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు వాటాదార్ల నుంచి ఎదురుదెబ్బ తలిగింది. ఫిలిప్ మోరిస్ ప్రొడక్ట్స్ SAకి సంవత్సరానికి రూ. 1,000 కోట్ల విలువైన అన్‌మాన్యుఫాక్చర్డ్‌ టొబాకోను ఎగుమతి చేసే పార్టీ లావాదేవీకి సంబంధించిన కంపెనీ ప్రతిపాదనను వాటాదార్లు తిరస్కరించారు.


షాలిమార్ పెయింట్స్: వ్యక్తిగత కారణాల వల్ల కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి దావీందర్ డోగ్రా రాజీనామా చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.