Stock Market Today, 08 November 2023: వరుసగా మూడు రోజుల లాభాల తర్వాత, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల వల్ల ఇండియన్‌ ఈక్విటీలు మంగళవారం చిన్నపాటి విరామం తీసుకున్నాయి.


లాభపడ్డ అమెరికన్‌ స్టాక్స్
వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నుంచి మరింత స్పష్టత కోసం పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్న నేపథ్యంలో, US ట్రెజరీ ఈల్డ్స్‌లో తిరోగమనం కారణంగా S&P 500, నాస్‌డాక్‌ మంగళవారం పెరిగాయి. 


పెరిగిన ఆసియాన్‌ స్టాక్స్
బిగ్ టెక్‌లో ర్యాలీ US స్టాక్స్‌ను రెండేళ్లలో అత్యధిక లాభాలకు తీసుకెళ్లడంతో, ఆ సంకేతాలను అనుసరించి ఆసియా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి.


ఈ రోజు ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 25 పాయింట్లు లేదా 0.13 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,520 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: టాటా పవర్, మజగాన్ డాక్, పతంజలి. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


పవర్‌ గ్రిడ్‌: 2023 సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో, పవర్ గ్రిడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 5% వృద్ధిని నమోదు చేసి రూ. 3,834 కోట్లకు చేరుకుంది. రూ.11,530.43 కోట్ల ఆదాయం వచ్చింది. రూ. 10 ఫేస్‌ వాల్యూ ఉన్న ఒక్కో షేరుకు 40% (రూ.4) మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. డిసెంబరు 6న ఈ డివిడెండ్‌ను కంపెనీ చెల్లిస్తుంది.


శ్రీ సిమెంట్‌: సెప్టెంబర్‌ క్వార్టర్‌లో శ్రీ సిమెంట్ ఏకీకృత నికర లాభం రెండింతలు పెరిగింది, రూ. 447 కోట్లుగా ఈ సిమెంట్‌ కంపెనీ ప్రకటించింది.


IRCTC: ఇండియన్ రైల్వేస్ టూరిజం అండ్‌ క్యాటరింగ్ విభాగమైన IRCTC, సెప్టెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో రూ. 295 కోట్ల స్టాండలోన్‌ నెట్‌ ప్రాఫిట్‌ ప్రకటించింది. ఏడాది క్రితం వచ్చిన రూ.226 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 30% పెరిగింది.


అపోలో టైర్స్‌: Q2 FY24లో అపోలో టైర్స్ రూ. 473 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ.6,280 కోట్ల ఆదాయం సంపాదించింది.


దీపక్ నైట్రేట్: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దీపక్ నైట్రేట్‌ మిగుల్చుకున్న నికర లాభం రూ. 205 కోట్లు. కార్యకలాపాల ద్వారా వచ్చిన రూ. 1778 కోట్ల ఆదాయం మీద ఈ లాభం మిగిలింది.


ఓల్టాస్: గృహోపకరణాల వ్యాపారాన్ని విక్రయించాలన్న ప్రతిపాదనను టాటాలు పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఓల్టాస్‌ యాజమాన్యం ఖండించింది.


ఐనాక్స్ విండ్‌: 10 రూపాయల ముఖ విలువ కలిగిన ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయడం ద్వారా నిధుల సమీకరణకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


ఇండిగో: ప్రాట్ & విట్నీ నుంచి పౌడర్ మెటల్ సమస్య నేపథ్యంలో, ఆక్సిలరేటెడ్‌ ఇంజిన్ల తొలగింపుల కారణంగా నాలుగో త్రైమాసికంలో ముప్పైకి పైగా విమానాలు ఆగిపోతాయని (aircraft on ground - AOG) అంచనా వేస్తున్నట్లు ఇండిగో తెలిపింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ కేవైసీని ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? స్టెప్‌-బై-స్టెప్‌ ప్రాసెస్‌ ఇదిగో


Join Us on Telegram: https://t.me/abpdesamofficial