Stock Market Today, 07 June 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 23 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,702 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ఎన్‌డీటీవీ: న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ నేటి (బుధవారం, 07 జూన్‌ 2023) నుంచి స్వల్పకాలిక అదనపు నిఘా ఫ్రేమ్‌వర్క్ నుంచి బయట పడింది. దీంతో ట్రేడర్లు NDTV షేర్లలో స్వేచ్ఛగా ట్రేడ్‌ చేసుకోవచ్చు.


అదానీ గ్రూప్‌ స్టాక్స్‌: అదానీ గ్రీన్ ఎనర్జీ ‍‌(Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ (Adani Transmission), అదానీ విల్మార్‌ (Adani Wilmar), అదానీ పవర్‌ (Adani Power) స్టాక్స్‌లో సర్క్యూట్ లిమిట్‌ను BSE పెంచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ విల్మార్‌ సర్క్యూట్ పరిమితి 5% నుంచి 10%కి సవరించింది. అదానీ పవర్‌ సర్క్యూట్ పరిమితిని 5% నుంచి 20%కి పెంచింది, ఈ స్టాక్‌కు ఇది భారీ బూస్ట్‌గా పని చేస్తుంది.


టొరెంట్ పవర్: 5,700 మెగావాట్ల సామర్థ్యం గల మూడు పంప్‌డ్ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో టొరెంట్ పవర్ (Torrent Power) ఒక అవగాహన ఒప్పందంపై (MoU) సంతకం చేసింది.


GMR ఎయిర్‌పోర్ట్స్‌: హైదరాబాద్ విమానాశ్రయంలో ఉన్న 8,18,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న వేర్‌హౌస్ ఫెసిలిటీని విక్రయించనున్నట్లు GMR గ్రూప్ ప్రకటించింది.


టాటా పవర్: కంపెనీ షేర్లు ఇవాళ ఎక్స్ డివిడెండ్‌తో ట్రేడ్‌ అవుతాయి. అంటే, టాటా పవర్‌ (Tata Power) ఇటీవల ప్రకటించిన డివిడెండ్‌ మొత్తం స్టాక్‌ ప్రైస్‌ నుంచి తగ్గుతుంది. కాబట్టి టాటా పవర్ షేర్లు ఈరోజు ఫోకస్‌లో ఉంటాయి.


RCF: కంపెనీ ప్లాంట్‌లో గ్యాస్ టర్బో జనరేటర్ బ్రేక్‌డౌన్‌కు సంబంధించిన ఆర్బిట్రేటర్ తీర్పు RCFకు అనుకూలంగా వచ్చింది. జీటీజీఎస్‌ను సొంత ఖర్చుతో మరమ్మతులు చేయాలని న్యాయస్థానం కాంట్రాక్టర్‌ను ఆదేశించింది.


విప్రో: మైక్రోసాఫ్ట్ క్లౌడ్‌లో నిర్మించిన కొత్త బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ సొల్యూషన్స్‌ను విప్రో (Wipro) ప్రారంభించింది. ఆర్థిక సేవల విషయంలో బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ పనితీరును ఇది సులభతరం చేస్తుంది.


సొనాట సాఫ్ట్‌వేర్: నూతన డిజిటల్ ఆవిష్కరణలు తీసుకురావడానికి & తన వ్యాపారాలను డిజిటల్‌లోకి మార్చే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయడానికి SAP కామర్స్‌తో సొనాటా సాఫ్ట్‌వేర్‌ (Sonata Software) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.


ఇది కూడా చదవండి: LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.