LIC New Jeevan Anand Policy: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), దేశంలోని ప్రతి జనాభా వర్గానికి ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రకటిస్తుంటుంది. ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లల చదువు, వివాహం, పదవీ విరమణ, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తలుపుతట్టే ఖర్చుల కోసం ముందే ప్లాన్ చేసుకోవచ్చు, వ్యయాలకు చిర్నవ్వుతో వెల్‌కమ్ చెప్పవచ్చు.
LIC పాలసీల్లో బాగా పాపులర్ అయిన ఒక స్కీమ్ ఉంది. ఆ పథకం పేరు LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ (LIC New Jeevan Anand Policy). లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలంగా ఈ పాలసీని అమలు చేస్తోంది. తాజాగా, ఈ పాలసీకి సంబంధించిన కొత్త వెర్షన్‌ను ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ప్రారంభించింది.
LIC కొత్త జీవన్ ఆనంద్ పాలసీ వివరాలు:
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అనేది ఒక పార్టిసిపేటింగ్ హోల్ లైఫ్ ఎండోమెంట్ ప్లాన్. దీనిలో పెట్టుబడిదార్ల పొదుపు ప్రయోజనం ప్లస్ జీవిత బీమా కవరేజ్ రెండింటినీ పొందుతారు. ఇది LIC జీవన్ ఆనంద్ కొత్త రూపం అని గుర్తుంచుకోండి. ఈ పాలసీలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో బలమైన రాబడి పొందవచ్చు. హామీతో కూడిన రాబడులతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా అందుతాయి. రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో కస్టమర్‌కు 100 సంవత్సరాల పాటు లైఫ్ కవరేజ్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ స్కీమ్ కోసం కట్టే డబ్బుకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) కింద ఆదాయ పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్న పాలసీదారుకు పాలసీ మెచ్యూరిటీ సమయంలో పూర్తి బెనిఫిట్స్ చేతికొస్తాయి. ఒకవేళ, పాలసీ మెచ్యూరిటీ సమయం కంటే ముందే మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ అందుతాయి. తద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుంది.
రోజుకు కేవలం రూ. 45తో రూ. 25 లక్షల రిటర్న్ పొందవచ్చు
LIC న్యూ జీవన్ ఆనంద్ పాలసీ ప్రకారం, పెట్టుబడిదార్లకు కనీసం రూ. 5 లక్షల హామీ మొత్తాన్ని పొందుతారు. ఈ ప్రకారం, 35 సంవత్సరాల వ్యవధిలో రూ. 25 లక్షలు చేతికి వస్తాయి. మీరు 35 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటే, ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ. 16,300 లేదా నెలవారీ ప్రాతిపదికన రూ. 1,358 పెట్టుబడి పెట్టాలి. రోజువారీ పెట్టుబడి గురించి చెప్పుకుంటే, రోజుకు కేవలం 45 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా 35 సంవత్సరాలకు మొత్తం 25 లక్షల రూపాయలకు మీరు యజమాని అవుతారు. ఈ 35 సంవత్సరాల్లో మీరు చెల్లించే మొత్తం 5,70,500 రూపాయలు (16,300 x 35) అవుతుంది. ఈ పెట్టుబడికి 4 రెట్లకు పైగా మొత్తం మీకు దక్కుతుంది.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ అక్కర్లేదు