Stock Market Today, 06 June 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 16 పాయింట్లు లేదా 0.09 శాతం రెడ్ కలర్‌లో 18,709 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
SBI: డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల జారీ ద్వారా, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ మోడ్‌లో, FY24 కోసం నిధుల సేకరణను పరిశీలించడానికి, ఆమోదించడానికి SBI బోర్డ్ ఈ నెస 9న సమావేశం అవుతుంది.
గోద్రెజ్ కన్స్యూమర్: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) ఆగస్టు 10 నుంచి ఆసిఫ్ మల్బరీ నియామకాన్ని గోద్రేజ్ కన్స్యూమర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదించింది.
అదానీ స్టాక్స్: షేర్ బ్యాక్డ్ లోన్‌లు, అంబుజా సిమెంట్స్‌ను కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణంలో కొంత భాగం ముందస్తు చెల్లింపు ద్వారా లోన్ బుక్‌ను $2.65 బిలియన్ల మేర అదానీ గ్రూప్ తగ్గించింది.
ఐనాక్స్ విండ్: సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఐనాక్స్ విండ్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉందని వచ్చిన వార్తల తర్వాత ఆ కంపెనీని వివరణ జారీ చేసింది. అది రొటీన్ ఆపరేటింగ్ మ్యాటర్ అని, వాలిడేషన్ ప్రాసెస్‌లో ఉందని కంపెనీ తెలిపింది.
SBI కార్డ్స్: NCDల (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు) జారీ ద్వారా రూ. 3,000 కోట్ల వరకు సమీకరించే ప్రణాళికను SBI కార్డ్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది.
మారుతి సుజుకి: భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన యూనిట్ల దగ్గర రెండు సౌర విద్యుత్ ప్లాంట్ల పనిని ప్రారంభించింది.
ఎంబసీ REIT: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను 7.77% కూపన్ రేట్‌తో జారీ చేసి రూ. 1,050 కోట్లను ఎంబసీ REIT సేకరించింది.
HG ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్: నార్త్ సెంట్రల్ నుంచి రూ. 677 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌ను HG ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ అందుకుంది.
ఇండిగో: 2023-24లో 100 మిలియన్ల మంది ప్రయాణీకులను తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మరిన్ని దేశీయ & అంతర్జాతీయ రూట్‌లలో సర్వీసులను నడుపుతుంది.
ఇది కూడా చదవండి: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.