Stock Market Today, 03 July 2023: ఎస్‌జీఎక్స్ నిఫ్టీ (SGX Nifty) పేరు ఇవాళ్టి నుంచి గిఫ్ట్‌ నిఫ్టీగా మారింది. ఇవాళ (సోమవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 15 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,360 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ఎయిర్‌టెల్: వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ, భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్‌లో (Bharti Airtel Ltd) 0.3% వాటాను శుక్రవారం బ్లాక్ డీల్ ద్వారా ఆఫ్‌లోడ్ చేసింది. తద్వారా రూ. 1,649 కోట్లు సంపాదించింది. 


అదానీ ట్రాన్స్‌మిషన్: ప్రమోటర్ ఎంటిటీ ఫోర్టిట్యూడ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌లోని (Adani Transmission Ltd) తన మొత్తం వాటాను శుక్రవారం బల్క్ డీల్స్ ద్వారా దాదాపు రూ. 2665 కోట్లకు విక్రయించింది. అదే రోజు, కంపెనీలో రూ. 1,676 కోట్ల విలువైన వాటాను GQG పార్ట్‌నర్స్‌ కొనుగోలు చేసింది.


HDFC బ్యాంక్: కవల కంపెనీలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ & హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC Ltd) విలీనం జులై 1 నుంచి అమలులోకి వచ్చింది.


ఈజీ ట్రిప్ ప్లానర్స్‌: ఈజీ ట్రిప్ ప్లానర్స్‌లో, దీని ప్రమోటర్ ఎంటిటీ 5.75% స్టేక్‌ను శుక్రవారం ఓపెన్‌ మార్కెట్ డీల్స్‌ ద్వారా విక్రయించింది. 


TVS మోటార్: భారత ఆర్థిక వ్యవస్థ మంచి వేగంతో వృద్ధి చెందుతుందని, రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంటిన్యూగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేసిన TVS మోటార్, దీనికి అనుగుణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ కంపెనీ గ్రోత్‌ మొమెంటం కొనసాగుతుందని అంచనా వేస్తోంది.


ఆటో స్టాక్స్: మంత్లీ సేల్స్‌ డేటా విడుదలతో ఆటో కంపెనీల షేర్లు ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


అల్ట్రాటెక్ సిమెంట్: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) గ్రే సిమెంట్ 28.6 మిలియన్ టన్నులు, వైట్ సిమెంట్ 0.41 మిలియన్ టన్నులు అమ్మినట్లు అల్ట్రాటెక్ సిమెంట్ అప్‌డేట్‌ చేసింది.


L&T ఫైనాన్స్: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & CEO అయిన దీనానాథ్ దుభాషి వచ్చే ఏడాది ఏప్రిల్ 30న పదవీ విరమణ చేస్తారు.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఈ నెల 01 నుంచి, స్టేట్‌ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) కామేశ్వర్రావు కొడవంటి ‍‌(Kameshwar Rao Kodavanti) బాధ్యతలు స్వీకరించారు.


మరో ఆసక్తికర కథనం: దేశంలో ఏ కంపెనీ ఎక్కువ టాక్స్‌ కడుతోంది? టాప్‌-10 లిస్ట్‌ ఇదిగో


Join Us on Telegram: https://t.me/abpdesamofficial  


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.