Countdown Begins for Saalar Tease : ప్రభాస్ 'ఆదిపురుష్' తర్వాత అభిమానులు ఎంత గానో ఎదురుచూస్తోన్న 'సలార్' పై మేకర్స్ ఎట్టకేలకు అప్ డేట్ ను రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకూ కేవలం పలు పోస్టర్లతోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా రివీల్ చేసిన అనౌన్స్ మెంట్ ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది.


హోంబలే సంస్థ నిర్మిస్తోన్న 'సలార్' సినిమాను 'కేజీయఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. 'కేజీయఫ్' సూపర్ సక్సెస్ తర్వాత హోంబాలే, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్ మరోమారు రిపీట్ కానుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గతేడాదే ‘సలార్’ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా లెక్కలన్నీ తలకిందులయ్యాయి. దీంతో ఇది ఈ సినిమా విడుదలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 28న థియేటర్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతేడాదే ప్రకటించారు.


టీజర్ విడుదలకు కౌంట్ డౌన్


ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న 'సలార్' టీజర్ పై మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా టీజర్‌ విడుదలపై ఓ హింట్ ఇచ్చింది. వచ్చే వారంలోనే 'సలార్' సాంపిల్ వీడియో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చిత్ర బృందం ఇదే విషయంపై ట్వీట్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. సలార్ టీజర్ కు కౌంట్ డౌన్ మొదలైందని, అప్ డేట్స్ కోసం హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్ ను చూడాలని ట్వీట్‌లో పేర్కొంది.


జూలై 7న 90 సెకన్ల సునామీ 


ప్రభాస్ పెర్ఫార్మెన్స్, ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అని సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 90 సెకన్ల టీజర్ కట్ చేశారని, రవి బస్రూర్ మార్క్ BGM సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అంతే కాదు సలార్ టీజర్ ను జులై 7న విడుదల చేయనున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి.






హై వోల్టేజ్ యాక్షన్ సినిమా 


‘సలార్’ సినిమా కథపై ఇప్పటివరకూ ఎలాంటి క్లూ లేదు. కానీ ప్రభాస్ మాత్రం బొగ్గు గనిలో కూలీగా నటించినట్టు సమాచారం. పోస్టర్లు చూస్తే మాత్రం ఇదో హై వోల్టేజ్ యాక్షన్ సినిమా అని అర్థమవుతుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, దేవరాజ్, పృథ్వీరాజ్ సుకుమార్ తదితరులు నటిస్తున్నారు. రూ.200 కోట్లు రూ. బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి చాలా వరకు షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇక 5 భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా.. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.


Read Also : 'ఉస్తాద్ భగత్ సింగ్' పై క్రేజీ అప్డేట్.. త్వరలోనే షూటింగ్ రీ షెడ్యూల్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial