Stocks to watch today, 31 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 63 పాయింట్లు లేదా 0.36 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,768 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


సన్ ఫార్మా, ACC, కోల్ ఇండియా, వొడాఫోన్ ఐడియా, ఇండియన్ హోటల్స్ కంపెనీలు ఇవాళ 2022 డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: అబుదాబికి చెందిన ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ (IHC) అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌లో (FPO) $400 మిలియన్ల పెట్టుబడి పెట్టనుంది. భారీ అమ్మకాలతో మూడు రోజులుగా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ కష్టపడుతున్న సమయంలో, ఎఫ్‌పీవో ద్వారా గౌతమ్ అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీలోకి IHC నుంచి వస్తున్న పెట్టుబడి ఉత్సాహాన్ని పెంచింది.


2021 డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ. 2,579 కోట్ల లాభంతో పోలిస్తే, 2022 డిసెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ యాజమాన్యంలోని BPCL ఏకీకృత నికర లాభం 36% తగ్గి రూ. 1,747 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (revenue from operations) 13% పెరిగింది.


2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇన్‌ఫ్రా మేజర్ లార్సెన్ & టూబ్రో (L&T) పన్ను తర్వాతి లాభంలో ఏడాది ప్రాతిపదికన 24% పెరిగి రూ. 2,553 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం కూడా 17% పెరిగింది.


టెక్‌ మహీంద్ర: 2022 డిసెంబర్ త్రైమాసికంలో టెక్ మహీంద్ర నికర లాభం సంవత్సరానికి (YoY) 5% క్షీణించి రూ. 1,297 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాదికి 20% పెరిగి రూ. 13,735 కోట్లుగా నమోదైంది. 


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB): ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం 2022 డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో 44% తగ్గి రూ. 629 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ. 1,127 కోట్లుగా ఉంది.


గెయిల్‌ ఇండియా: దేశంలోని అతి పెద్ద గ్యాస్ పంపిణీదారు అయిన గెయిల్ ఇండియా లాభం మూడో త్రైమాసికంలో దాదాపు 93% తగ్గింది. సరఫరా అంతరాయాల కారణంగా గ్యాస్ అమ్మకాలు భారీగా దెబ్బతిన్నాయి.


HDFC బ్యాంక్: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను (HDFC) HDFC బ్యాంక్‌లో విలీనం చేసే ప్రతిపాదనపై ఫిబ్రవరి 3న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ముంబై బెంచ్‌లో తుది విచారణ జరగనుంది. ప్రతిపాదిత విలీనానికి ఇప్పటికే ఈక్విటీ షేర్‌హోల్డర్లు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి ఆమోదం లభించింది.


సెంచరీ టెక్స్‌టైల్స్ & ఇండస్ట్రీస్‌: 7.97% అన్‌ సెక్యూర్డ్ అన్‌ లిస్టెడ్ రేటెడ్ రీడీమబుల్‌ ఎన్‌సీడీలను ఒక్కొక్కటి రూ. 1 లక్ష చొప్పున ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన కేటాయించడానికి కంపెనీ బోర్డు ఆమోదించింది. NCDల జారీ ద్వారా మొత్తం రూ. 400 కోట్లు సేకరించనుంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.