Stocks to watch today, 28 March 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 50 పాయింట్లు లేదా 0.30 శాతం గ్రీన్‌ కలర్‌లో 17,063 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:    


PNC ఇన్ఫ్రాటెక్: హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌ (HAM) హైవే ప్రాజెక్ట్ కోసం  819 కోట్ల రూపాయలను కోట్‌ చేసిన PNC ఇన్‌ఫ్రాటెక్‌ను లోయస్ట్‌ బిడ్డర్‌గా ప్రభుత్వం ప్రకటించింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: క్వింటిలియన్ బిజినెస్ మీడియాలో (Quintillion Business Media) 49% వాటాను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ అయిన AMG మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ (AMG Media Networks Ltd) కొనుగోలు చేసింది. ఎక్స్ఛేంజీలకు దీని గురించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ అప్‌డేట్‌ చేసింది.


ఆల్‌కార్గో లాజిస్టిక్స్: గతి-కింటెత్సు ఎక్స్‌ప్రెస్‌లో ‍‌(Gati-Kintetsu Express) 30% వాటాను 407 కోట్ల రూపాయలకు ఆల్‌కార్గో లాజిస్టిక్స్ కైవసం చేసుకుంటోంది.


SJVN: జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (JBIC) నుంచి 915 కోట్ల రూపాయల గ్రీన్ ఫైనాన్సింగ్‌ను ఈ కంపెనీ పొందింది. బ్యాంక్‌తో కొన్ని జపాన్ ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కూడా ఈ రుణంలో కొంతభాగాన్ని మంజూరు చేస్తాయి.


దిలీప్ బిల్డ్‌కాన్: ఆంధ్రప్రదేశ్‌లో రూ. 780.12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే కొత్త HAM ప్రాజెక్ట్ 'బెంగళూరు - విజయవాడ అండర్‌ భారతమాల పరియోజన ఫేజ్-1' కోసం దిలీప్ బిల్డ్‌కాన్ L-1 బిడ్డర్‌గా నిలిచింది.


HDFC: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDs) ద్వారా రూ. 57,000 కోట్లను ఈ కంపెనీ సమీకరించబోతోంది, ఇందుకు డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది.


వేదాంత: ఈక్విటీ షేర్లపై ఐదో మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించి, ఆమోదించడానికి కంపెనీ బోర్డు ఇవాళ సమావేశం కాబోతోంది. మధ్యంతర డివిడెండ్‌కు అర్హతను నిర్ణయించేందుకు రికార్డు తేదీగా ఏప్రిల్ 7ను కంపెనీ నిర్ణయించింది.


ఆదిత్య బిర్లా క్యాపిటల్‌: ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌లో ‍‌(Aditya Birla Insurance Brokers) తన మొత్తం వాటాను విక్రయించేందుకు ఆదిత్య బిర్లా క్యాపిటల్ (Aditya Birla Capital) బోర్డ్ ఆమోదించింది.


నెస్లే ఇండియా: మొదటి త్రైమాసిక ఫలితాలతో పాటు 2023 సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించి ఆమోదించేందుకు ఏప్రిల్ 12న ఈ కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం కాబోతోంది.         


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.