ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్-2023 నోటిఫికేషన్ మార్చి 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీ పీఈసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 23న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుములేకుండా మే 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ.500 ఆలస్య రుసుముతో మే 17 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. మే 27 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 31 నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నారు.
వివరాలు...
* ఏపీ పీఈసెట్ – 2023
అర్హత: బీపీఈడీ కోర్సుకు డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూజీడీపీఈడీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి బీపీఈడీ కోర్సుకు 19 సంవత్సరాలు, డీపీఈడీ కోర్సుకు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇదివరకే పీఈటీలుగా పనిచేస్తున్న అభ్యర్థులు ఏపీపీఈసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేదు. వీరు సంబంధిత డీఈఓల ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్- రూ.900, బీసీ-రూ.800, ఎస్సీ-ఎస్టీలకు రూ.700.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 18.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.05.2023.
➥ రూ.500 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 17.05.2023.
➥ రూ.1000 ఆలస్యరుసముతో దరఖాస్తుకు చివరితేది: 24.05.2023.
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 11.05.023 - 12.05.2023
➥ దరఖాస్తుల సవరణకు అవకాశం (రూ.2000 ఆలస్య రుసుము అభ్యర్థులకు): 25.05.2023.
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 27.05.2023 నుంచి.
➥ ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష తేది (ఫిజికల్ ఈవెంట్స్): 31.05.2023 నుంచి.
Also Read:
ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!
ఏపీలో లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 22న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్ విడుదల కాగా.. మార్చి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు మొదలైంది. అభ్యర్థుల నుంచి మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 5 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో మే 9 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎడిట్ చేసుకునేందుకు మే 10 నుంచి 11 వరకు అవకాశం కల్పించారు. మే 15 నుంచి పరీక్ష హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
లాసెట్ దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్-2023' నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది. ఏపీ ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 24న ప్రారంభంకాగా.. ఏప్రిల్ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. అయితే రూ.1000ల ఆలస్య రుసుముతో మే 2 వరకు, రూ.2000ల ఆలస్య రుసుముతో మే 10 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. పరీక్ష హాల్‌టికెట్లు మే 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
ఎడ్‌సెట్ దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..