Stocks to watch today, 24 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 74 పాయింట్లు లేదా 0.41 శాతం గ్రీన్ కలర్‌లో 18,221 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
వీక్లీ కాంట్రాక్ట్‌తో పాటు జనవరి మంత్ కాంట్రాక్ట్ బుధవారంతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, సెక్టార్ల వారీగా కాకుండా స్టాక్ స్పెసిఫిక్‌గా స్టాక్ మార్కెట్‌లో యాక్షన్స్ ఉండవచ్చు.
2022 డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన ఆదాయాలను పరిశీలించి ఆమోదించడానికి TVS మోటార్, కోల్గేట్ పామోలివ్, HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కో, SBI కార్డ్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్, సోమ్ డిస్టిలరీస్ కంపెనీల బోర్డు సమావేశాలు ఇవాళ జరుగుతాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
యాక్సిస్ బ్యాంక్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 62% వృద్ధిని నమోదు చేసి రూ. 5,853 కోట్లకు చేరుకుంది. రూ. 5,500 కోట్ల నికర లాభాన్ని మార్కెట్ అంచనా వేస్తే, అంతకు మించి సాధించింది. నికర వడ్డీ ఆదాయం (NII) 32.4% వృద్ధితో రూ. 11,459 కోట్లకు చేరుకుంది.
టాటా మోటార్స్: ఈ ఆటోమేకర్‌కు చెందిన అమెరికన్ డిపాజిటరీ షేర్లు (ADS) న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ అయ్యాయి. నిన్న (సోమవారం) అవి డీలిస్ట్ అయ్యాయి.
మారుతి సుజుకి: 2022 డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను ఈ కంపెనీ ఇవాళ (మంగళవారం) విడుదల చేస్తుంది. ఆదాయం 17% YoY వృద్ధితో రూ. 27,162 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా వేసింది. అయితే, QoQలో 9% తగ్గొచ్చని భావిస్తున్నారు. నికర లాభం ఏడాదికి 85% పైగా పెరిగి రూ. 1,873 కోట్లకు చేరుకోవచ్చని లెక్క కట్టారు. QoQలో 32% కంటే ఎక్కువే తగ్గవచ్చని భావిస్తున్నారు. వెనుక సీట్ బెల్ట్ మౌంట్ బ్రాకెట్లలో లోపాన్ని సరిదిద్దడానికి 11,177 యూనిట్ల గ్రాండ్ విటారాను రీకాల్ చేస్తున్నట్లు ఈ కంపెనీ సోమవారం తెలిపింది.
J&K బ్యాంక్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ రుణదాత నికర లాభం సంవత్సరానికి 79% పెరిగి రూ. 312 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 27% పెరిగి రూ. 1,257 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 54 bps మెరుగుపడి 4.10%కి చేరుకుంది.
సింజీన్ ఇంటర్నేషనల్: డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 5.5% పెరిగి రూ. 110 కోట్లకు చేరుకుంది. ఆదాయం 22.5% పెరిగి రూ.786 కోట్లకు చేరుకుంది.
త్రివేణి టర్బైన్: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం సంవత్సరానికి 40% పెరిగి రూ. 43.8 కోట్లకు చేరుకుంది, ఆదాయం 35% వృద్ధితో రూ. 293 కోట్లకు చేరుకుంది.
వెల్‌స్పన్ కార్ప్: స్టీల్ పైపులను సరఫరా చేయడానికి, వెల్‌స్పన్ కార్ప్‌కు చెందిన సౌదీ విభాగం 1,200 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌ను పొందింది.
జెన్సార్ టెక్నాలజీస్: డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 16% క్షీణించి రూ. 76.5 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్‌గా (QoQ) 35% పెరిగింది. ఆదాయం ఏడాదికి 8.6% పెరిగి రూ. 1,198 కోట్లకు చేరుకుంది, కానీ సీక్వెన్షియల్‌గా 3% తగ్గింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.