Stocks to watch today, 18 November 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 52 పాయింట్లు లేదా 0.29 శాతం రెడ్‌ కలర్‌లో 18,295 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఆర్కియన్ కెమికల్స్ ఇండస్ట్రీస్: బ్రోమిన్, ఇండస్ట్రియల్ సాల్ట్ ఎగుమతిలో దేశంలో అతి పెద్ద కంపెనీ అయిన ఆర్కియన్ కెమికల్స్ ఇండస్ట్రీస్ ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో లిస్ట్‌ కానుంది. రూ. 1,462 కోట్ల IPO నవంబర్ 9-11 తేదీల మధ్య జరిగింది. రూ. 386-407 ధరల పరిధిలో 32.23 రెట్లు బుక్ అయింది.


ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్: ఈ NBFC కంపెనీ షేర్లు కూడా ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతున్నాయి. నవంబర్ 9-11 తేదీల్లో, రూ. 450-474 ధర శ్రేణిలో IPO జరిగింది. ప్రైమరీ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 1,960 కోట్లను సేకరించింది. ఈ ఇష్యూ మీద ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు.


టాటా మోటార్స్: BSE సెన్సెక్స్‌లో, ఫార్మా ప్లేయర్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ స్థానంలో స్వదేశీ ఆటో మేజర్ టాటా మోటార్స్ భాగం అవుతుంది. ఈ మార్పు డిసెంబర్ 19, 2022 నుంచి అమల్లోకి వస్తుంది.


ONGC: కొత్త చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి కోసం బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టడంతో, ఈ సంవత్సరం ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని ఇన్వెస్టర్ల కాల్‌లో కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.


NMDC: కర్నాటకలోని కుమారస్వామి గనుల నుంచి ఇనుప ఖనిజం ఉత్పత్తిని సంవత్సరానికి ఏడు మిలియన్ టన్నుల (MTPA) నుంచి 10 మిలియన్ టన్నులకు పెంచడానికి వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో దాదాపు రూ. 900 కోట్లు ఖర్చు చేయనుంది.


FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa): నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నుంచి వచ్చిన డేటా ప్రకారం, 5.42 కోట్ల నైకా షేర్లను రూ. 184.55 ధరకు ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ TPG గ్రోత్ ఆఫ్‌లోడ్ చేసింది. ఈ బ్లాక్‌ డీల్‌ విలువ రూ. 1,000 కోట్లకు పైమాటే.


జొమాటో: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా తన పదవికి రాజీనామా చేశారు. నాలుగున్నర సంవత్సరాల క్రితం జొమాటోలో చేరిన గుప్తా, ఫుడ్ డెలివరీ వ్యాపారం CEO స్థానం నుంచి 2020లో సహ వ్యవస్థాపకుడి స్థాయికి చేరారు.


భారత్ ఎలక్ట్రానిక్స్: క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో సహకారం కోసం IIT మద్రాస్‌తో జాయింట్ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. క్వాంటం సైన్స్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ రంగంలో BEL, IITM సామర్థ్యాలను పెంచడం లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగింది.


ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్: షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు నవంబర్ 25న సమావేశం అవుతోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.