Stocks to watch today, 17 November 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 40.5 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్‌ కలర్‌లో 18,439.5 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


విప్రో: యూరోపియన్ వర్క్స్ కౌన్సిల్ (EWC) ఏర్పాటు చేసేందుకు అక్కడి ఉద్యోగ సంఘాలతో ఈ IT సర్వీసెస్ మేజర్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో ఏర్పాటు చేయబోయే EWC, ఒక భారతదేశ సంస్థ నెలకొల్పే మొదటి కౌన్సిల్‌గా నిలుస్తుంది.


One97 కమ్యూనికేషన్ (Paytm): $200 మిలియన్ విలువైన Paytm షేర్లను బ్లాక్‌ డీల్‌ ద్వారా విక్రయించాలని జపనీస్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ చూస్తోంది. ఈ విక్రయానికి సంబంధించిన ధరల పరిధి రూ. 555-601 గా నిర్ణయించారు.


పేజ్ ఇండస్ట్రీస్: తెలంగాణలో రెండు తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం రూ. 290 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ఈ దుస్తుల తయారీ సంస్థ తెలిపింది. కొత్త యూనిట్లు మొత్తం 7,000 మంది స్థానిక యువకులకు ఉపాధి కల్పిస్తాయి. ఇది స్పోర్ట్స్‌వేర్, అథ్లెయిజర్ వేర్‌లను తయారు చేస్తుంది.


FSN ఈ-కామర్స్ వెంచర్స్ ‍‌(Nykaa): BSE బల్క్ డీల్ డేటా ప్రకారం.. లైట్‌హౌస్ ఇండియా ఫండ్-III, 3 కోట్ల Nykaa షేర్లను ఒక్కొక్కటి సగటు ధర రూ. 175.13 చొప్పున ఓపెన్‌ మార్కెట్ లావాదేవీల ద్వారా రూ. 525.39 కోట్లకు ఆఫ్‌లోడ్ చేసింది.


అరబిందో ఫార్మా: ఆంధ్రప్రదేశ్‌లోని పైడిభీమవరంలో ఉన్న API నాన్-యాంటీబయోటిక్ తయారీ కేంద్రమైన యూనిట్ XI కోసం, USFDA నుంచి ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్‌ను అరబిందో ఫార్మా అందుకుంది. USFDA ఈ యూనిట్‌ని జులై 25 - ఆగస్టు 2 మధ్య తనిఖీ చేసింది. 3 పరిశీలనలతో ఫారం 483 జారీ చేసింది.


టిమ్‌కెన్ ఇండియా: బేరింగ్స్ కంపెనీ గుజరాత్‌లోని భరూచ్‌లో రోలర్ బేరింగ్‌లు, విడిభాగాలను తయారు చేయడానికి కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి ఇప్పటికే బరూచ్‌లో ఒక తయారీ కర్మాగారం ఉంది.


గ్లోబల్ హెల్త్: ఈ హాస్పిటల్స్ చైన్ ఆపరేటర్‌లో 15 లక్షల షేర్లను ఒక్కో షేరు సగటు ధర రూ. 414.57 చొప్పున నోమురా ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కొనుగోలు చేసింది. మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ 36.3 లక్షల షేర్లను ఒక్కో షేరును సగటు ధర రూ. 401 చొప్పున కొనుగోలు చేసింది.


బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్: గోల్డ్‌మన్ సాచ్స్ ఇండియా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో స్కీమ్‌ కోసం ఈ స్నాక్స్ కంపెనీలో 17.45 లక్షల షేర్లను సగటు ధర రూ. 324.5 చొప్పున గోల్డ్‌మన్ సాచ్స్ ఫండ్స్‌ కొనుగోలు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.