Stocks to watch today, 17 February 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 107 పాయింట్లు లేదా 0.59 శాతం రెడ్ కలర్‌లో 17,960 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
RPP ఇన్‌ఫ్రా: గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నుంచి కంపెనీ రూ. 59 కోట్ల విలువైన ఆర్డర్లను ఈ కంపెనీ దక్కించుకుంది. చెన్నై కార్పొరేషన్ పరిధిలో, కోవలం బేసిన్‌లో వరద నీటి మళ్లింపు కాలువల నిర్మాణం కోసం ఈ ఆర్డర్లు వచ్చాయి.
రైల్‌టెల్: బెంగళూరు మెట్రో నుంచి రూ. 27.07 కోట్ల విలువైన IT నెట్‌వర్క్ మౌలిక సదుపాయాల ఏర్పాటు, పరీక్ష, ప్రారంభం కోసం వర్క్ ఆర్డర్‌ను రైల్‌టెల్ అందుకుంది.
శ్రేయ్ ఇన్‌ఫ్రా: తీర్మానాలపై ఈ-ఓటింగ్ ఫలితాన్ని కన్సాలిడేటెడ్ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (CoC) నమోదు చేసిందని, నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (NARCL) సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్‌కు మెజారిటీ ఓటింగ్ ద్వారా ఆమోదం లభించిందిన ఈ కంపెనీ తెలిపింది.
వేదాంత: ఈ కంపెనీ సమర్పించిన అత్యధిక తుది ఆఫర్ ధర ఆధారంగా కెల్వార్డాబ్రి, అనుబంధిత PGE బ్లాక్ ఈ-వేలంలో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది.
ఏంజెల్ వన్: కంపెనీ CEO నారాయణ్ గంగాధర్ వ్యక్తిగత కారణాల వల్ల మే 16, 2023 నుంచి తన పదవికి రాజీనామా చేస్తారు.
పిరమల్ ఫార్మా: లెక్సింగ్‌టన్‌లో ఉన్న ఈ కంపెనీ తయారీ ఫ్లాంటు కోసం ఎస్టాబ్లిష్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టును (EIR) US FDA జారీ చేసింది. దీంతో తనిఖీ విజయవంతంగా ముగిసినట్లయింది.
HDFC: కార్పొరేట్ బాండ్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని 250 బిలియన్ రూపాయలకు (3.03 బిలియన్ డాలర్లు) హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) పెంచింది. ఇది దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ బాండ్ ఇష్యూ.
భారత్ ఫోర్జ్: హెచ్‌ఏఎల్ (HAL), ఫౌండ్రీ & ఫోర్జ్ డివిజన్, సార్లోహా అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, భారత్ ఫోర్జ్ కలిసి ఏరోస్పేస్ రకం స్టీల్ అల్లాయ్‌ల అభివృద్ధి, ఉత్పత్తిలో పరస్పర సహకారం కోసం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.
హిందుస్థాన్ జింక్: వేదాంత లిమిటెడ్‌కు చెందిన విదేశీ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన విభేదాలను పరిష్కరించేందుకు గనుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరపాలని కంపెనీ యోచిస్తున్నట్లు హిందుస్థాన్ జింక్ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు.
ఇండిగో: ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) ప్రమోటర్ గ్రూప్‌లో ఒకరైన శోభా గంగ్వాల్, తన దగ్గరున్న స్టేక్‌లో 4% వాటాను గురువారం బహిరంగ మార్కెట్ ద్వారా సుమారు రూ. 2,944 కోట్లకు విక్రయించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.