Stocks to watch today, 13 December 2022: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 25 పాయింట్లు లేదా 0.14 శాతం గ్రీన్ కలర్‌లో 18,623 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా మోటార్స్: తన అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ లిమిటెడ్‌లో (Tata Technologies Ltd) తన హోల్డింగ్‌ను ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) మార్గం ద్వారా కొంతమేర ఉపసంహరించుకునేందుకు టాటా మోటార్స్ నిర్ణయించింది. టాటా మోటార్స్ IPO కమిటీ కూడా దీనికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
ICICI బ్యాంక్: వ్యాపార వృద్ధికి కావల్సిన డబ్బు కోసం బాండ్ల ద్వారా రూ. 5,000 కోట్లను సమీకరించినట్లు ఈ ప్రైవేట్ రంగ రుణదాత తెలిపింది. ఈ బాండ్ల కాల గడువు 7 సంవత్సరాలు. వీటికి ప్రత్యేక హక్కులు లేదా అధికారాలు ఉండవు.
HCL టెక్నాలజీస్: స్నాక్ కంపెనీ మోండెలెజ్ ఇంటర్నేషనల్ (Mondelez International), తన సైబర్ సెక్యూరిటీని మెరుగు పరుచుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ వర్క్‌ప్లేస్ సర్వీసులను HCL టెక్నాలజీస్‌తో ఇప్పటికే ఉన్న మల్టీ ఇయర్ ఒప్పందాన్ని మరింత కాలం పొడిగించింది.
మాక్రోటెక్ డెవలపర్స్: లోధా బ్రాండ్‌తో ఆస్తులను విక్రయించే ఈ రియల్టీ సంస్థ ప్రమోటర్లు కంపెనీలో 7.2 శాతం వాటాను ADIA సహా సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించడం ద్వారా రూ. 3,547 కోట్లను సమీకరించారు. కంపెనీలో కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం ఉండాలన్న నిబంధనకు లోబడి తమ షేర్లను అమ్మారు.
KEC ఇంటర్నేషనల్: తాను చేస్తున్న వివిధ వ్యాపారాల కోసం రూ. 1,349 కోట్ల విలువైన ఆర్డర్‌లను ఈ ఇన్‌ఫ్రా EPC మేజర్ అందుకుంది. భారత్, సార్క్, మిడిల్ ఈస్ట్. అమెరికాలో T&D ప్రాజెక్ట్‌ల కోసం ప్రసారాలు & పంపిణీ వ్యాపార విభాగం ఆర్డర్‌లను పొందింది.
వి-గార్డ్ ఇండస్ట్రీస్: కొచ్చికి చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సన్‌ఫ్లేమ్ ఎంటర్‌ప్రైజెస్‌లో (SEPL) 100 శాతం వాటాను రూ. 660 కోట్లకు నగదు రహిత, రుణ రహిత ప్రాతిపదికన కొనుగోలు చేయడానికి ఖచ్చితమైన ఒప్పందాల మీద సంతకం చేసింది. ఈ లావాదేవీ జనవరి 2023 మధ్య నాటికి ముగుస్తుందని భావిస్తున్నారు.
MTAR టెక్నాలజీస్: రెండు దశల ఆల్-లిక్విడ్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ డిజైన్, డెవలప్‌మెంట్ కోసం ఇన్-స్పేస్ ఇండియాతో (IN-SPACe India) MTAR టెక్నాలజీస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్: తన అనుబంధ సంస్థ GR హైవేస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌లో తనకు ఉన్న మొత్తం షేర్లను 15 కోట్ల రూపాయలకు బదిలీ చేయడానికి లోకేష్ బిల్డర్స్‌తో GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ బదిలీ తర్వాత, GR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనుబంధ సంస్థగా GHIMPL మారుతుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.