Stocks to watch today, 10 January 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 23 పాయింట్లు లేదా 0.13 శాతం రెడ్‌ కలర్‌లో 18,149 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 56,893 కోట్లుగా ఉన్న అంచనాలను అధిగమించి రూ. 58,229 కోట్లకు ఏకీకృత ఆదాయాన్ని ఈ సాఫ్ట్‌వేర్ మేజర్ సాధించింది, 19% YoY వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం సంవత్సరానికి 11% పెరిగి రూ. 10,846 కోట్లకు చేరుకుంది, అయితే అంచనా వేసిన రూ.11,200 కోట్ల కంటే ఇది తక్కువగా ఉంది. ఒక్కో షేరుకు రూ. 67 ప్రత్యేక డివిడెండ్ & రూ. 8 మధ్యంతర డివిడెండ్‌ను కూడా టీసీఎస్ ప్రకటించింది.


టాటా మోటార్స్: 2022 డిసెంబరు త్రైమాసికంలో, టాటా మోటార్స్‌ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) టోకు విక్రయాలు 15% వృద్ధితో 79,591 యూనిట్లకు పెరిగాయి. చిప్ సరఫరాల మెరుగుదల వల్ల వృద్ధి సాధ్యమైంది. ఈ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రిటైల్ విక్రయాలు 5.9% పెరిగి 84,827 యూనిట్లకు చేరుకున్నాయి. Q3లో 400 మిలియన్ పౌండ్లకు పైగా ఫ్రీ క్యాష్‌ ఫ్లో ఉంటుందని JLR ఆశిస్తోంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, ఐదో తరం లేదా 5G వైర్‌లెస్ సేవలను 4 రాష్ట్రాల్లోని 10 నగరాల్లో ప్రారంభించింది. అవి.. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర. ఆగ్రా, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్, తిరుపతి, నెల్లూరు, కోజికోడ్, త్రిసూర్, నాగ్‌పుర్, అహ్మద్‌నగర్‌లలో 5G సేవలు ప్రారంభమయ్యాయి.


JSW స్టీల్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో, ఈ స్టీల్‌ మేకర్ ముడి ఉక్కు ఉత్పత్తి సంవత్సరానికి 17% పెరిగి 6.24 మిలియన్ టన్నులకు చేరుకుంది. సగటు సామర్థ్య వినియోగం మెరుగుపడడంతో ఈ వృద్ధి సాధ్యమైంది.


ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నేటి నుంచి (మంగళవారం, జనవరి 10, 2023) MCLR ఆధారిత వడ్డీ రేటును 5 bps లేదా 0.05% పెంచింది. ఈ పెంపు తర్వాత రుణ రేట్లు 7.70-8.45% పరిధిలో ఉంటాయి.


IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్‌: ఈ కంపెనీ, దీని అనుబంధ సంస్థ IRB ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (IRB Infrastructure Pvt Ltd) కలిసి 2022 డిసెంబర్‌లో మొత్తం టోల్ వసూళ్లలో 32% YoY వృద్ధిని నమోదు చేశాయి, రూ. 388 కోట్లను ఆర్జించాయి. IRB ఇన్విట్ ఫండ్‌కు చెందిన 5 స్పెషల్ పర్పస్ వెహికల్స్ (SPVలు) ద్వారా వచ్చిన టోల్ కలెక్షన్ 18% పెరిగి రూ. 77.7 కోట్లకు చేరుకుంది.


లుపిన్: నాన్ డిస్ట్రోఫిక్ మయోటోనిక్ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగించే NaMuscla ఔషధం కొన్న రోగులకు రిటైల్ ధరలో కొంత భాగాన్ని రీయింబర్స్‌మెంట్ చేయడానికి స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఈ కంపెనీ ఆమోదం పొందింది.


స్టార్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్: 2022 డిసెంబర్ 31 నాటికి ఈ బీమా మేజర్ 'గ్రాస్‌ డైరెక్ట్‌ ప్రీమియం' రూ. 8,752 కోట్లుగా నమోదైంది, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 13% పెరిగింది. ఆరోగ్యం-రిటైల్ కేటగిరీ స్థూల ప్రత్యక్ష ప్రీమియం సంవత్సరానికి 19% పెరిగి రూ. 8,045.5 కోట్లకు చేరింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.