Stocks to watch today, 07 December 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 28 పాయింట్లు లేదా 0.15 శాతం రెడ్‌ కలర్‌లో 18,724 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ: ఈ మ్యూచువల్‌ ఫండ్‌ ప్లేయర్‌లో తనకున్న మొత్తం వాటాను బుధవారం విక్రయించాలని UKకు చెందిన పెట్టుబడి సంస్థ & ప్రమోటర్ abrdn Investment Management భావిస్తోంది. HDFC అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో యూకే ప్రమోటర్‌కు 10.21% వాటా ఉంది. బుధవారం బ్లాక్ డీల్ ద్వారా విక్రయం జరగనుంది. 


వేదాంత: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ మైనింగ్ మేజర్, డిబెంచర్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరించాలని ఆలోచిస్తోంది. ఈ మొత్తాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో సేకరిస్తుంది.


సైమెన్స్: గుజరాత్‌లోని దాహోద్‌లో రూ. 20,000 కోట్ల విలువైన 9000 HPతో (హార్స్ పవర్) 1,200 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను తయారు చేసే ప్రాజెక్టుకు ఈ ఇంజినీరింగ్ సంస్థ అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది. లోకోమోటివ్‌ల తయారీ, నిర్వహణ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతీయ రైల్వే  టెండర్లు పిలిచింది.


వొడాఫోన్‌ ఐడియా: మొబైల్ టవర్ విక్రేత ATC టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు బకాయిలకు బదులు రూ. 1,600 కోట్ల డిబెంచర్లను జారీ చేయాలన్న టెలికాం ప్లేయర్ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో లాప్‌ అయింది.


బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్: ఈ స్నాక్స్ కంపెనీ రూ. 40.92 కోట్ల ఏకీకృత పన్ను తర్వాతి లాభంతో, గత ఏడాది కంటే 43.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆదాయం 32 శాతం పెరిగి రూ. 577 కోట్లకు చేరుకుంది.


జమ్ము & కశ్మీర్ బ్యాంక్: మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్‌ డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం ద్వారా తన కస్టమర్లకు కార్‌ లోన్ సౌకర్యాన్ని సులభంగా అందించడానికి మారుతి సుజుకి ఇండియాతో ఈ బ్యాంక్ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 2020లో ప్రారంభమైనప్పటి నుంచి, మారుతి సుజుకి స్మార్ట్ ఫైనాన్స్ రూ. 39,000 కోట్లకు పైగా విలువైన రుణాలను పంపిణీ చేసింది.


క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ మెరీనా III సింగపూర్, క్రాఫ్ట్స్‌మ్యాన్ ఆటోమేషన్‌లో తనకున్న మొత్తం 5.48 శాతం వాటాను లేదా 11,56,808 షేర్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా విక్రయించింది. ఒక్కో షేరును సగటున రూ. 3,200 వద్ద అమ్మి రూ. 370 కోట్లను వెనక్కు తీసుకుంది.


ఇర్కాన్ ఇంటర్నేషనల్: సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ సిస్టం ఏర్పాటు కోసం శ్రీలంక రైల్వేస్ నుంచి ఒక ఆర్డర్‌ను ఇర్కాన్ ఇంటర్నేషనల్‌ గెలుచుకుంది. ఈ ఆర్డర్‌ విలువ రూ.122 కోట్లు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.