మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇండిగో: ఏవియేషన్ దిగ్గజం ఇండిగో డిసెంబర్ త్రైమాసిక నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 1,422 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 129 కోట్లతో పోలిస్తే లాభం 1,000% పెరిగింది. మూడో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 61% పెరిగి రూ. 14,932 కోట్లకు చేరుకుంది
పేటీఎం: డిసెంబర్ త్రైమాసికంలో ఎబిటా స్థాయిని నెగెటివ్ నుంచి పాజిటివ్‌లోకి తీసుకొచ్చింది. మార్గదర్శకత్వం కంటే మూడు త్రైమాసికాల ముందే దీనిని పేటీఎం సాధించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టాన్ని రూ. 392 కోట్లకు తగ్గించింది. నికర నష్టం ఏడాది క్రితం రూ. 779 కోట్లుగా ఉంది.
టాటా స్టీల్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టాటా స్టీట్ ఆదాయ లెక్కల్లో పురోగతి ఏమీ ఉండకపోవచ్చని భావిస్తున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ పన్ను తర్వాత లాభం (PAT) సగానికి పైగా తగ్గి రూ. 4,300 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.
ITC: డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ నికర లాభం సంవత్సరానికి (YoY) 21% పెరిగి రూ. 5,031 కోట్లకు చేరింది. మార్కెట్ అంచనా రూ. 4,605 కోట్ల కంటే ఇది ఎక్కువ. కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం స్వల్పంగా 2.3% పెరిగి రూ. 16,226 కోట్లకు చేరుకుంది.
మ్యారికో: డిసెంబర్ త్రైమాసికంలో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సంస్థ మ్యారికో ఏకీకృత పన్ను తర్వాతి లాభం రూ. 328 కోట్లుగా నమోదైంది, సంవత్సరానికి (YoY) 6% పెరిగింది. కార్యకలాపాల ఆదాయం సంవత్సరానికి 3% పెరిగి రూ. 2,470 కోట్లకు చేరుకుంది.
ఇమామి: డిసెంబరు త్రైమాసికంలో ఏకీకృత నికర అమ్మకాలు రూ.975 కోట్లుగా ఉన్నాయి, ఇది 2% పెరిగి, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా రూ.983 కోట్లకు పెరిగింది. కంపెనీ పీఏటీ 8 శాతం పెరిగి రూ.237 కోట్లకు చేరింది.
MOIL: 2023 జనవరిలో 1.26 లక్షల టన్నుల ముడి మాంగనీస్‌ను ఈ కంపెనీ తవ్వి తీసింది. MOIL ప్రారంభిన తర్వాత ఏ ఏడాది జనవరి నెలలో చూసినా ఇదే అత్యుత్తమ ఉత్పత్తి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.7% ఎక్కువ.
క్వెస్ కార్ప్: క్వార్టర్-ఆన్-క్వార్టర్ ప్రాతిపదికన, డిసెంబర్ త్రైమాసికంలో క్వెస్ కార్పొరేషన్ ఆదాయం 4%, ఎబిటా 8% వృద్ది చెందింది. ఎబిటా మార్జిన్ 10 బేసిస్ పాయింట్లు మెరుగుపడింది. PAT, గత త్రైమాసికం కంటే 116% పెరిగి రూ. 86 కోట్లకు చేరింది.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: డిసెంబర్ త్రైమాసికానికి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పన్ను తర్వాతి లాభం రూ. 280 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం రూ. 2,602 కోట్లుగా ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.