Stocks to watch today, 01 November 2022: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 104.5 పాయింట్లు లేదా 0.58 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,165 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్‌ కంపెనీలు: సన్ ఫార్మాస్యూటికల్స్, అదానీ పోర్ట్స్ & సెజ్, టెక్ మహీంద్రా, UPL, ఓల్టాస్, వరుణ్ బెవరేజెస్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ ఫైనాన్స్, UPL, మ్యాక్రోటెక్ డెవలపర్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్, కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్


నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


టాటా స్టీల్: 2023-23 జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఈ ఉక్కు దిగ్గజం ఏకీకృత నికర లాభం దాదాపు 90 శాతం క్షీణతతో రూ. 1,297 కోట్లకు పడిపోయింది. అధిక ఖర్చుల కారణంగా దిగజారింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.12,547.70 కోట్లుగా ఉంది.


భారతీ ఎయిర్‌టెల్: సెప్టెంబరు త్రైమాసికంలో ఈ టెలికాం మేజర్ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం కంటే 89 శాతం పెరిగి రూ. 2,145 కోట్లకు చేరుకుంది. అధిక ఆర్పు (ARPU), పెరిగిన డేటా వినియోగం, 4G బేస్ విస్తరణ సహకరించాయి.
ఎయిర్‌టెల్ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన దాదాపు 22 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది.


యాక్సిస్ బ్యాంక్: బ్లాక్ డీల్స్ ద్వారా, ఈ కంపెనీకి చెందిన $410 మిలియన్ (రూ. 3,400 కోట్లు) విలువైన 1.24 శాతం వాటాను బెయిన్ క్యాపిటల్ విక్రయించే అవకాశం ఉంది. ఫ్లోర్ ప్రైస్‌ ఒక్కో షేరుకు రూ.888గా నిర్ణయించింది. సోమవారం ముగింపు ధర రూ.906 కంటే ఇది 2 శాతం తగ్గింపు.


లార్సెన్ & టుబ్రో: కార్యకలాపాల ఆదాయం పెరగడంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకీకృత పన్ను తర్వాతి లాభం (PAT) 26 శాతం పెరిగి రూ. 2,819.20 కోట్లకు చేరుకుంది. కంపెనీ గత ఏడాది కాలంలో రూ.2,231.33 కోట్ల ఏకీకృత నికర PATని నమోదు చేసింది.


అదానీ పవర్: DB పవర్ లిమిటెడ్‌కు చెందిన థర్మల్ పవర్ అసెట్స్‌ను కొనుగోలు చేయడానికి గడువును నవంబర్ 30, 2022 వరకు, ఒక నెల పొడిగించినట్లు అదానీ పవర్ తెలిపింది. డీల్‌ విలువ రూ. 7,017 కోట్లు.


గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్: మల్టిపుల్ స్ల్కెరోసిస్‌ చికిత్సకు ఉపయోగించే ఫింగోలిమోడ్ 0.5 mg క్యాప్సూల్స్‌ను అమెరికన్ మార్కెట్‌లో విడుదల చేసింది. నోవార్టిస్ ఫార్మాస్యూటికల్స్‌ తీసుకొచ్చిన గిలెన్యా ఔషధానికి ఇది జెనరిక్ వెర్షన్.


ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్‌ నికర లాభం 2022 సెప్టెంబర్‌ త్రైమాసికంలో రెండు రెట్లు పెరిగి రూ.116 కోట్లకు చేరుకుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.41 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


క్యాస్ట్రోల్ ఇండియా: 2022 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం స్వల్పంగా రూ.187 కోట్లకు పెరిగింది. ముంబైకి చెందిన ఈ కంపెనీ గత ఏడాది ఇదే కాలంలో రూ.186 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.


సరేగమా ఇండియా: 2022-23 రెండో త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 36.42 శాతం వృద్ధితో రూ. 46.11 కోట్లను నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ మ్యూజిక్‌ లేబుల్‌ రూ. 33.80 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.