Stock Market Updates: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian Stock Markets) నేడు కళకళలాడాయి. వాల్‌స్ట్రీట్‌ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో మదుపర్లు (Investors) కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్‌మార్క్‌ సూచీలు తిరిగి రికవరీ బాట పట్టాయి. ముడి చమురు ధరలు (Crude Oil Prices)  తగ్గడమూ ఇందుకు కలిసొచ్చింది. రష్యా, ఉక్రెయిన్ (Russia Ukrain War) మధ్య శాంతి చర్చలు మొదలవుతుండటమూ ధైర్యం నింపింది. గురువారం వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో సూచీలు ఒడుదొడుకులకు లోనవ్వొచ్చు. నేడు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 1039 పాయింట్లు లాభపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,975 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,776 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) నేడు 56,553 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. అప్పట్నుంచి కొనుగోళ్లు పెరగడంతో సూచీ మరింత పైకి వెళ్లింది. 56,389 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 56,869 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1039 పాయింట్ల లాభంతో 56,816 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 16,663 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) బుధవారం 16,876 వద్ద ఆరంభమైంది. మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లకు ఎగబడటంతో భారీ లాభాల్లో పయనించింది. 16,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిన సూచీ 16,987 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 312 పాయింట్ల లాభంతో 16,975 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంకు (Nifty Bank) 35,555 వద్ద మొదలైంది. 35,461 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,806 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మొత్తంగా 725 పాయింట్ల లాభంతో 35,748 వద్ద ముగిసింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తప్ప మిగతా అన్ని బ్యాంకుల షేర్లు లాభాల్లో ముగిశాయి.


Gainers and Lossers


నిఫ్టీలో 47 కంపెనీల షేర్లు లాభాల్లో 3 నష్టాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్‌ సెమ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో,  ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, శ్రీసెమ్‌ భారీ లాభాల్లో ముగిశాయి. సిప్లా, టాటా కన్జూమర్‌, సన్‌ఫార్మా స్వల్ప నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో క్లోజ్‌ అయ్యాయి. ఆటో, బ్యాంక్‌, ఐటీ, మెటల్‌, పవర్‌ రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 2-3 శాతం మెరుగయ్యాయి.