స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడం, మంగళవారం ఐరోపా మార్కెట్లు మెరుగ్గా ముగియడం ఇందుకు దోహదం చేసింది. ముడి చమురు ధరల పెరుగుదల భయాలూ పోవడంతో మదుపర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. సెన్సెక్స్ 657 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 17,463 వద్ద ముగియడం గమనార్హం.
క్రితం రోజు 57,808 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సె్క్స్ నేడు 58,163 వద్ద మొదలైంది. దాదాపుగా 350 పాయింట్ల వరకు గ్యా్‌ప్ అప్‌తో ఆరంభమైంది. లాభాల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ 58,105 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత మరింత పుంజుకొని 58,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 657 పాయింట్ల లాభంతో 58,465 వద్ద ముగిసింది.
మంగళవారం 17,266 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,370 వద్ద గ్యాప్‌అప్‌తో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరు కొనసాగినప్పటికీ 17,339 వద్ద ఇంట్రాడే కనిష్ఠం స్థాయిని తాకింది. ఆ తర్వాత 17,477 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 197 పాయింట్ల లాభంతో 17,463 వద్ద ముగిసింది.
బ్యాంకు నిఫ్టీ సైతం భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 38,283 వద్ద మొదలైన సూచీ 38,192 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత పుంజుకొని 38,648 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 581 పాయింట్ల లాభంతో 38,610 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 42 కంపెనీలు లాభాల్లో, 8 నష్టాల్లో ముగిశాయి. కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, ఐఓసీ, శ్రీసెమ్, హిందాల్కో షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, బీపీసీఎల్, ఐటీసీ, ఎస్‌బీఐ లైఫ్, టాటా స్టీల్ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్ మినహా మిగతా రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఆటో, మెటల్, బ్యాంక్ సూచీలు 1-2 శాతం ఎగిశాయి.
Also Read: ఐపీవో క్రేజ్ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!
Also Read: ఈ షేరులో మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే 20 నెలల్లో రూ.18 లక్షలు సంపాదించేవారు!