హమ్మయ్య..! మార్కెట్లో మళ్లీ బుల్ జోష్ పెరిగింది. అంతర్జాతీయంగా సెంటిమెంటు బాగుండటం, నిరుద్యోగ రేటు తగ్గిపోవడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సెంటిమెంటు రావడంతో భారత మార్కెట్లు కళకళలాడాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 454 పాయింట్లు లాభపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,536 వద్ద ముగిసింది. ఒక్క రిలయన్స్ షేరు జోరందుకోవడంతో సూచీలకు ఊపొచ్చింది!
బుధవారం 58,8340 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 58,363 పాయింట్ల వద్ద మొదలైంది. క్రమంగా కొనుగోళ్లు పెరగడంతో ఇంట్రాడే గరిష్ఠమైన 58,901ని తాకింది. నవంబర్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగిసినా 454 పాయింట్ల లాభంతో 58,795 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 17,417 వద్ద మొదలైంది. తొలుత ఒడుదొడుకులకు లోనవ్వడంతో 17,351 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. తర్వాత బుల్ జోరు అందుకోవడంతో 17,564 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద ముగిసింది.
మార్కెట్లు మళ్లీ బుల్ బాట పట్టడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర పెరగడం ఒక కారణంగా ఉంది. సూచీలో ఈ కంపెనీ వెయిటేజీ ఎక్కువ. బుధవారం భారీగా నష్టపోయిన రిలయన్స్ నేడు రూ.2,373 వద్ద మొదలైంది. మొదట్లో కాస్త ఒడుదొడుకులకు లోనైనా తర్వాత షేరు ధరకు మద్దతు దొరికింది. ఈ బ్లూచిప్ కంపెనీ షేరును తక్కువ ధరకే దక్కించుకొనేందుకు కొనుగోళ్లు చేపట్టడంతో ఇంట్రాడేలో రూ.2,502 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి రూ.149 లాభంతో 2,501 వద్ద ముగిసింది.
నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్, దివిస్ ల్యాబ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టెక్ మహీంద్రా లాభపడ్డాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐఓసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ నష్టాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, ఫార్మా సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. బ్యాంకింగ్, ఆటో రంగాల్లో మాత్రం అమ్మకాలు కనిపించాయి.
Also Read: Rich Adani : అంబానీ కంటే అదానీనే రిచ్ .. ఆసియా ధనవంతుడు ఆయనే !
Also Read: Audi Q5: ఆడీ క్యూ5 కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Also Read: Gold-Silver Price: శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. భారీగా పతనమైన వెండి, తాజా ధరలు ఇలా..