మార్కెట్లు మళ్లీ ఎరుపెక్కాయి! దలాల్ స్ట్రీట్‌లో మళ్లీ బేర్స్ పట్టు బిగించాయి! మండే రోజు సూచీలు మండిపోయాయి! పెరుగుతున్న ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లు నెగెటివ్‌గా ఓపెన్ అవ్వడం, ఫెడ్ టేపరింగ్ ఆందోళన.. ఇలా అన్నీ కలిపి భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. మదుపర్లలో సెంటిమెంట్ నెగెటివ్‌గా ఉండటంతో విక్రయాలకు దిగారు. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సహా మిగతా సూచీలన్నీ ఎర్రబారాయి!
క్రితం ముగింపు 57,696తో పోలిస్తే బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,778 వద్ద ఆరంభమైంది. సెషన్ ఆరంభమైన రెండు గంటల్లోనే విక్రయాలు వెల్లువెత్తడంతో 200 పాయింట్లకు పైగా సూచీ నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ఇంట్రాడే కనిష్ఠమైన 56,684ను తాకింది. చివరికి 949 పాయింట్ల నష్టంతో 56,747 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 284 పాయింట్ల నష్టంతో 16,912 వద్ద ముగిసింది. క్రితం రోజు 17,196 వద్ద ముగిసిన సూచీ నేడు 17,209 వద్ద మొదలైంది. ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకొంది. 16,891 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
బ్యాంక్ నిఫ్టీ అయితే తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. సూచీలోని అన్ని బ్యాంకులు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం 36,252 వద్ద ఆరంభమైన సూచీ మరికాసేపటికే ఇంట్రాడే గరిష్ఠమైన 36,344ను తాకింది. ఐరోపా మార్కెట్లు మొదలవ్వగానే క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడే కనిష్ఠమైన 35,696ను తాకి చివరికి 461 పాయింట్ల నష్టంతో 35,735 వద్ద ముగిసింది.
నిఫ్టీలో యూపీఎల్ మినహాయిస్తే మిగిలిన అన్ని కంపెనీల షేర్లు నష్టపోయాయి. కోల్‌ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నష్టాల్లో ముగిశాయి. ఐటీ సహా అన్ని రంగాల సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి.
Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?