Stock Market Update: స్టాక్‌ మార్కెట్‌లో ఎక్కువ రిటర్న్స్‌ ఇచ్చే స్టాక్స్‌ కోసం ఇన్వెస్టర్లు తెగ గాలిస్తుంటారు, రీసెర్చ్‌ చేస్తుంటారు. ఎక్కువ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ కొన్న షేర్లు ఏమిటో తెలిస్తే, మన ఫోకస్‌లో ఉన్నవి కూడా అవే అయితే, మనకు ఇంకా ఎక్కువ భరోసా ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో, 100కి పైగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌ 118 స్టాక్స్‌ కొన్నాయి. వాటిలో 9 కౌంటర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY24) 30% పైగా రిటర్న్స్‌ ఇచ్చాయి. అంటే 3 నెలల కంటే తక్కువ టైమ్‌లోనే అవి 30% తగ్గకుండా లాభాలు అందించాయి. మే 2023 నాటికి, 100కు పైగా మ్యూచువల్ ఫండ్ పథకాల పోర్ట్‌ఫోలియోల్లో ఈ స్క్రిప్స్‌ ఉన్నాయి.


FY24లో ఇప్పటివరకు 30% పైగా రిటర్న్స్‌ ఇచ్చిన 9 కౌంటర్లు:


డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా)   |   FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 59%
2023 మే నెలలో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్స్‌ సంఖ్య: 103
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 3474 కోట్లు


ఆస్ట్రల్‌  | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 47%
2023 మే నెలలో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్స్‌ సంఖ్య: 101
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 4276 కోట్లు


జొమాటో  | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 46%
2023 మే నెలలో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్స్‌ సంఖ్య: 102
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 4728 కోట్లు


హిందుస్థాన్ ఏరోనాటిక్స్   | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 41%
మే 2023లో స్టాక్ కలిగి ఉన్న MF పథకాల సంఖ్య: 156
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 8264 కోట్లు


డీఎల్‌ఎఫ్‌   | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 39%
మే 2023లో స్టాక్ కలిగి ఉన్న MF పథకాల సంఖ్య: 133
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 4181 కోట్లు


టాటా మోటార్స్    | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 35%
మే 2023లో స్టాక్ కలిగి ఉన్న MF పథకాల సంఖ్య: 243
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 15769 కోట్లు


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్   | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 30%
2023 మే నెలలో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్స్‌ సంఖ్య: 108
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 5837 కోట్లు


బంధన్ బ్యాంక్    | FY24లో ఇప్పటివరకు వచ్చిన లాభాలు: 30%
2023 మే నెలలో ఈ స్టాక్‌ను హోల్డ్‌ చేసిన MF స్కీమ్స్‌ సంఖ్య: 102
2023 మే నెలలో MFల ఈక్విటీ ఫండ్ మార్కెట్ వాల్యూ రూ. 3467 కోట్లు


మరో ఆసక్తికర కథనం: AIS అంటే ఏంటి, టాక్స్‌ ఫైలింగ్‌కు ఫామ్‌-16 ఉంటే సరిపోదా? 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.