Smallcap Bettings: వివిధ రంగాలకు చెందిన ఏడు స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌తో ఒక టాప్ పిక్స్‌ లిస్ట్‌ను యాక్సిస్ సెక్యూరిటీస్ రిలీజ్‌ చేసింది. అవి గరిష్టంగా 28% రిటర్న్‌ ఇవ్వగవని ఈ బ్రోకింగ్‌ కంపెనీ నమ్ముతోంది.


కిర్లోస్కర్ బ్రదర్స్ (Kirloskar Brothers)
టార్గెట్ ప్రైస్‌: రూ. 975
అప్‌సైడ్ స్కోప్: 17%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... (ఎ) కంపెనీ ఆర్డర్ బుక్‌లో బలమైన మెరుగుదల (బి) సేవల విభాగం నుంచి ఆదాయం పెరగడం (సి) వ్యాపార కార్యకలాపాల పునర్నిర్మాణం ఫలితంగా ROE, ROCE వరుసగా 21%, 26.4% మెరుగుపడొచ్చు, ఆపరేటింగ్‌ మార్జిన్లు FY25 నాటికి 190 bps పెరిగి 12.6%కు చేరొచ్చు.


జేటీఎల్‌ ఇండస్ట్రీస్ (JTL Industries)
టార్గెట్ ప్రైస్‌: రూ. 470
అప్‌సైడ్ స్కోప్: 13%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... దశల వారీగా వాల్యూమ్ విస్తరణ వల్ల FY23-FY25E కాలంలో ఆదాయం/ఎబిటా/ప్యాట్‌ను 46%/45%/51% CAGR వృద్ధితో బ్రోకరేజ్‌ అంచనా వేసింది. ఈ స్టాక్‌పై బయ్‌ రేటింగ్‌ ఇచ్చింది.


మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ ‍‌(Mahindra CIE Automotive)
టార్గెట్ ప్రైస్‌: రూ. 585
అప్‌సైడ్ స్కోప్: 13%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... (ఎ) ఆపరేషనల్‌ పెర్ఫార్మెన్స్‌, EV ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను నిర్మించడంపై దృష్టి పెట్టడం (బి) ఆరోగ్యకరమైన ఆర్డర్ బుక్‌, భారతీయ వ్యాపారంలో స్థిరమైన వృద్ధి (సి) బలమైన FCF జెనరేషన్స్‌, బ్యాలెన్స్‌ షీట్‌లో అతి తక్కువ రుణం  (d) భారతదేశ OEMల నుంచి వచ్చే డిమాండ్‌ను తీర్చేందుకు సామర్థ్యాన్ని పెంచుకోగల సత్తా


ప్రాజ్ ఇండస్ట్రీస్ (Praj Industries)
టార్గెట్ ప్రైస్‌: రూ. 550
అప్‌సైడ్ స్కోప్: 11%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... FY23లో ఇథనాల్ బ్లెండింగ్ బలంగా కొనసాగుతుంది కాబట్టి దేశీయ వ్యాపారం బాగానే ఉంటుంది. మొత్తం ఇథనాల్ డిమాండ్-సరఫరాలో అంతరం, ధాన్యం ఆధారిత డిస్టిలరీలపై పెరిగిన ఆసక్తి, డీకార్బనైజేషన్


సీసీఎల్ ప్రొడక్ట్స్‌ (CCL Products (India))
టార్గెట్ ప్రైస్‌: రూ. 750
అప్‌సైడ్ స్కోప్: 24%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... 1) మార్కెట్ షేర్‌ పెంచుకోవడం & కొత్త వ్యాపారాన్ని యాక్సెస్ చేయడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లలో స్థానాన్ని పదిల పరుచుకోవడం  2) ఖర్చు తక్కువయ్యే వ్యాపార నమూనా 3) వియత్నాం, భారత్‌లో సామర్థ్యాన్ని FY22లోని 38,500 MT నుంచి FY25 నాటికి 77,000 MTకి రెట్టింపు చేయడం 4) అధిక మార్జిన్ ఇచ్చే బ్రాండెడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించండం.


క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ (CreditAccess Grameen)
టార్గెట్ ప్రైస్‌: రూ. 1,600
అప్‌సైడ్ స్కోప్: 14%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... ప్రీమియం వాల్యుయేషన్స్‌లో ఉన్నప్పటికీ CAGrameenను బ్రోకరేజ్‌ ఇష్టపడుతోంది. మీడియం టు లాంగ్‌టర్మ్‌లో అత్యుత్తమ పనితీరును అందించడానికి ఈ కంపెనీ సిద్ధంగా ఉందని విశ్వసిస్తోంది. (ఎ) బలమైన గ్రామీణ ఉనికి, ఫోకస్‌ (బి) కస్టమర్ కేంద్రీకృత విధానం (సి) బలమైన సాంకేతిక మౌలిక సదుపాయాలు (డి) బలమైన రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ (ఇ) తగినంత మూలధనం గ్రోత్‌ ఇంజిన్‌ను నడిపిస్తాయంటోంది.


పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ (PNC Infratech)
టార్గెట్ ప్రైస్‌: రూ. 425
అప్‌సైడ్ స్కోప్: 28%


బ్రోకరేజ్‌ చెబుతున్న కారణాలు... (ఎ) బలమైన & వైవిధ్యభరితమైన ఆర్డర్ బుక్ (బి) ఆరోగ్యకరమైన బిడ్డింగ్ పైప్‌లైన్, కొత్త ఆర్డర్ ఇన్‌ఫ్లోలు, నిర్మాణ రంగంలో పెరుగుతున్న అవకాశాలు (సి) కంపెనీ సమర్థవంతమైన, సమయానుకూలంగా ప్రాజెక్టుల అమలు (డి)  బలమైన ఆర్థిక పరిస్థితి. వీటి కారణంగా PNCIL ఆదాయం/ఎబిటా/ప్యాట్‌ FY23-FY25E కాలంలో వరుసగా 12%/11%/13% CAGR వద్ద పెరుగుతుందని బ్రోకరేజ్‌ ఆశిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: షూరిటీ లేకుండా లోన్‌, పైగా వడ్డీ తక్కువ - ఎల్‌ఐసీ పాలసీ ఉంటే చాలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial