Stock Market News Today in Telugu: మంగళవారం నాడు నష్టాలు మిగిల్చిన ఇండియన్‌ బెంచ్‌మార్క్‌ సూచీలు, ఈ రోజు (బుధవారం, 31 జనవరి 2024) కూడా లోయర్‌ సైడ్‌లోనే ప్రారంభమయ్యాయి. మధ్యంతర బడ్జెట్‌కు ముందు రోజు కావడం, ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు అస్థిరంగా ఉన్నాయి. అయితే, ఆ ప్రతికూలతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.


మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే దాదాపు 250 పాయింట్లు పడిపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, కీలకమైన 71,000 మార్క్‌ దిగువకు పడిపోయింది. బుల్స్‌ మద్దతుతో బలం పుంజుకుని, తిరిగి అదే స్థాయిని ఓవర్‌టేక్‌ చేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 21,500 మార్క్‌ను టెస్ట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మార్కెట్‌ ప్రారంభ సమయానికి, బ్యాంక్ నిఫ్టీలో బలహీనతతో పాటు కొన్ని ఐటీ షేర్లలో కూడా క్షీణత కనిపిస్తోంది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 71,140 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 66.86 పాయింట్లు తగ్గి 71,073.04 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,522 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 34.85 పాయింట్లు లేదా 0.16 శాతం క్షీణతతో 21,487.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


సెన్సెక్స్ షేర్లు
ఓపెనింగ్‌ ట్రేడ్‌లో, సెన్సెక్స్‌30 ప్యాక్‌లో 17 స్టాక్‌లు లాభపడగా, 13 స్టాక్స్‌ క్షీణించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... టాటా మోటార్స్‌ 2.33 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.40 శాతం, టాటా స్టీల్ 0.97 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.77 శాతం, మారుతి 0.75 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.75 శాతం పెరిగాయి.


Q3 ఫలితాలను ప్రకటించిన లార్సెన్ & టూబ్రో (L&T), ఈ రోజు ప్రారంభంలోనే 5 శాతం తగ్గింది. కోటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు, టాటా మోటార్స్, NTPC, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ షేర్లు 1-2 శాతం వరకు పెరిగాయి.


L&T, టైటన్, ప్రైవేట్ బ్యాంకులు నిఫ్టీ50ని పడదోశాయి. మరోవైపు.. DRL, అదానీ పోర్ట్స్, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు సపోర్ట్‌గా నిలిచాయి.


బ్యాంక్ నిఫ్టీతో పాటు కొన్ని ఐటీ షేర్లు బలహీనంగా కనిపిస్తుంటే; నిఫ్టీ ఆటో, మెటల్ ఇండెక్స్‌లు ఆ బలం ప్రదర్శిస్తున్నాయి.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 17.11 పాయింట్లు లేదా 0.02% పెరిగి 71,157.01 దగ్గర; NSE నిఫ్టీ 12.35 పాయింట్లు లేదా 0.05% పెరిగి 21,534.45 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.8 శాతం క్షీణించింది. షాంఘై కాంపోజిట్, హ్యాంగ్ సెంగ్, కోస్పి, తైవాన్ మార్కెట్లు 0.3-0.5 శాతం మధ్య తగ్గాయి. US లేబర్ డేటాలో బలం కనిపించిన తర్వాత, మంగళవారం, US బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సైడ్‌లైన్స్‌లో ట్రేడ్‌ అయ్యాయి. యూఎస్‌ మార్కెట్లలో డౌ జోన్స్ 0.4 శాతం లాభంలో ముగిసింది. నాస్‌డాక్ 0.8 శాతం పడిపోయింది. S&P 500 0.1 శాతం తగ్గింది.


కీలకమైన US Fed పాలసీ నిర్ణయాలు, భారత కాలమానం ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి సమయానికి వెల్లడవుతాయి. ఫెడ్ రేట్లు తగ్గే సమయం దగ్గరలో ఉందా, దూరంలో అన్న విషయంపైనే ప్రపంచ మార్కెట్లు దృష్టి పెట్టాయి. FOMC మీటింగ్‌ తర్వాత ఫెడ్‌ ఛైర్‌ జెరోమ్‌ పావెల్‌ చేసే కామెంట్లు గ్లోబల్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. ఫెడ్‌ ఔట్‌కమ్‌ ప్రభావం మన మార్కెట్ల మీద గురువారం నాడు ఉంటుంది. దీనికితోడు, గురువారం రోజున కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) ప్రకటన ఉంటుంది. 


US బెంచ్‌మార్క్ 10 సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్‌ 4.019 శాతానికి తగ్గింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి