Trinayani Today Episode:

  సుమన గాయత్రీ దేవి చీర పట్టుకొని వచ్చి ఎవరూ లేని టైంలో గాయత్రీ పాప మీద వేయాలని అనుకుంటుంది. అది ఎద్దులయ్య చూస్తాడు. ఆ చీర గాయత్రీ పాప మీద పడితే గత జన్మ రూపం ప్రతిబింబంగా కనిపిస్తుందని.. అప్పుడు ఆ పాపే గాయత్రీ దేవి అని అందరికీ తెలిసి పోతుంది ఎద్దులయ్య అనుకుంటాడు. ఇంతలో సుమన ఆ చీరను పాప మీద వేస్తుంది. 


సుమన: ఇదేంటి ఈ పిల్ల మీద చీర వేయగానే పగలే చీకటిలా అయింది ఏంటి. అక్కడక్కడ లైట్లు వెలుగుతున్నాయి కానీ ఇక్కడ వెలగడం లేదు ఎందుకు. ఇంతలో గయాత్రీ దేవి ఫొటోల నుంచి ఓ లైట్ వచ్చి పాప మీద పడుతుంది. దాంతో సుమన షాక్ అవుతుంది. అంతే కాకుండా నాగయ్య ఓ పెద్ద పాములా మారి అక్కడ ప్రత్యక్షమవుతుంది. సుమన బిత్తర పోతుంది. 
ఎద్దులయ్య: వచ్చావా నాగయ్య గాయత్రీ దేవి ప్రతిబింబం చిట్టిమాతకు కనపడకూడదు అని పెద్ద పగడతో అడ్డుకున్నావా.. ఇక సుమన ఫిట్స్ వచ్చి కింద పడిపోతుంది. ఇక నాగయ్య పామే పాప మీద చీరను తీసేస్తుంది. సుమనకు ఏమైందని అందరూ కంగారుగా సుమన దగ్గరకు వస్తారు. ఫిట్స్ వచ్చిందని సుమన చేతిలో తాళాలు పెడతారు. 
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య చీర ఇక్కడ పడిఉంది ఏంటి.
ఎద్దులయ్య: తీసుకొస్తే ఉంటుంది కదా.. 
విశాల్: ఎవరు తీసుకొచ్చారు.
ఎద్దులయ్య: ఎందుకు తీసుకొచ్చావని చిట్టీ మాతనే అడగండి బాబు.
సుమన: పాము.. పాము..
నయని: సుమన నువ్వు తెరచిన స్టోర్‌ రూం తాళాలే నీకు పెడితే కానీ నీకు ఫిట్స్ పోలేదు.
విశాల్: మా అమ్మ చీరని ఎందుకు బయటకు తీశావ్..
సుమన: తిలోత్తమ అత్తయ్య గాయత్రీ పాప మెడ మీద ఆ చీరను ఎందుకు వేయాలి అనుకున్నారో తెలీదు. అడిగితే బాగోదని ఆ చీర తీసుకొచ్చి పాప మెడ మీద వేశాను బావగారు. అప్పుడు పెద్ద పెద్ద పాము వచ్చింది దాని పడగే పది అడుగులు ఉంటుందేమో.. అంతే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లు అనిపించింది అక్క.
నయని: ఆగిపోయినా బాగుండేది.. లేకపోతే ఏంటి.. చిన్న పిల్ల ఆడుకుంటుంటే గాయత్రీ దేవి గారు విడిచిన చీర తన మీద వేస్తారా ఎవరైనా.. 
తిలోత్తమ: సుమన భయంతో సరిగా చెప్పడం లేదురా ఇంకా ఏదో జరిగింది. 
విశాల్: అమ్మా.. నువ్వు అలా వేయడం చూసే పాప మీద ఎందుకు వేయకూడదు అని చూసింది.
తిలోత్తమ: నేను అంటే సంతోషంగా వేయాలి అనుకున్నా.. సుమన అనుమానంతో ఏదో చేయబోయి ఇలా చేసుకుంది. 
విక్రాంత్: షాక్‌తో చచ్చిపోతావ్ తెలుసా నువ్వు ఎవర్ని అడిగి ఇలా చేశావ్.. 
ఎద్దులయ్య: చిట్టి మాత ఇంకా ఆ భయం నుంచి పూర్తిగా బయటకు రాలేదు. గదిలోకి తీసుకెళ్లండి.. 
నయని: చీరని మీరు తప్ప ఇంకా ఎవరూ తాకడానికి వీల్లేదని చెప్పండి బాబుగారు.


తిలోత్తమ: నువ్వు చెప్పు సుమన అసలేం జరిగింది.
సుమన: మా అక్క దత్తత తీసుకున్న ఆ గాయత్రీ పాపని అందరూ పొగుడుతుంటే ఆలోచనలో పడ్డాను అత్తయ్య.
విక్రాంత్: నాకు ఎందుకు అలాంటి బిడ్డ పుట్టలేదు అనా..
ధురందర: పిల్లలు పుట్టని మాలాంటి వాళ్లకు.. పుట్టినా కూడా వేరే పిల్లలతో పోల్చుకునే మీ లాంటి వాళ్లకు చాలా తేడా ఉందే..
సుమన: గాయత్రీ అత్తయ్య చీరని తిలోత్తమ అత్తయ్య ఆ పాప మీద వేయాలి అనుకున్నప్పుడు హాసిని అక్కకు అమ్మవారు పూనింది. ఎవరూ లేనప్పుడు అదే చీరను ఆ పిల్ల మీద నేను వేస్తే ఏం జరుగుతుందా అని నేను వేశాను. 
తిలోత్తమ: సుమన పాము కనిపించక  ముందు ఏం జరిగిందో అది చెప్పు.
సుమన: వింత జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ అలా జరగడం నేను చూడలేదు. చీర పాప మెడలో వేయగానే.. అక్కడ అంతా ఓ మాయలా విచిత్రమైన వెలుగు ప్రసరించింది. 
ధురందర: గాయత్రీ అక్కయ్య చనిపోయినప్పటి చీర కదా ప్రేతాత్మ పూని ఉంటుంది. జాగ్రత్త సుమీ.
తిలోత్తమ: అదేం కాదులే సంథింగ్ జరిగుంటుంది.
విక్రాంత్: అదేంటో మీకు తెలీదు కానీ నేను కాస్త క్యాచ్ చేయగలను. 


నయని: నయని ఏడుస్తూ..బాబు గారు గాయత్రీ పాపని తిరిగి వాళ్ల తాతయ్యకి ఇచ్చేద్దామా.. 
హాసిని: అయ్యయ్యో ఏంటి చెల్లి నువ్వు మాట్లాడేది ఇది కలా నిజమా.. 
నయని: నిజమే అక్కా.. ఈ మాట చెప్పడానికి నేను ఎంత బాధ పడుతున్నానో చెప్పలేకపోతున్నాను. 
విశాల్: నయని గాయత్రీ మనకు భారం అవుతుందా..
నయని: భారం అవుతుందని కాదు దూరం అవుతుంది అని..
హాసిని: చెల్లి పాపకు ఏదైనా ఆపద వస్తుందా అని నువ్వు భయపడే అవకాశం కూడా లేదు.. ఎందుకు అంటే తనకు ఏం జరిగినా నీకు తెలీదు.
నయని: అదేంటి అక్క నాకు ఎందుకు తెలీదు. గానవి అంటే నేను కన్న కూతురు తనకి ఆపద వస్తే నేను గ్రహించలేను. కానీ గాయత్రీ విషయంలో అలా ఉండదు కదా.. 
విశాల్: అంటే నయని గాయత్రీని కూడా నువ్వు కన్న కూతురిలా చూసుకుంటున్నావ్ అని అలా అంటుంది. నువ్వు చెప్పు నయని అసలు పాప మనకు దూరం అవుతుంది అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది.
నయని: తీలోత్తమ అత్తయ్యే కాదు మా చెల్లి సుమన కూడా గాయత్రీ పాప మీద ప్రయోగాలు చేస్తుంది. పుట్టగానే తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నది మన దగ్గరకు వస్తే బంగారు భవిష్యత్ ఉంటుంది అనుకున్నాను కానీ తన గురించి ఎవరు ఏం అనుకుంటున్నారో కానీ గాయత్రీ పేరు తనకు ఉండటంతో ఎవరు ఏంచేస్తారో అని భయంగా ఉంది. 
విశాల్: నయని ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఎదుర్కొవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలే కానీ పాపకు ఏం అవుతుందా అని విడిచిపెట్టడం పద్ధతి కాదు.
నయని: పాప పేరిట 25లక్షల కోట్ల ఆస్తి ఉంది తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటుంది. 
విశాల్: మన దగ్గర ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది నయని. నువ్వు రిలాక్స్ గా ఉండు. ఉదయం ఆంజనేయ స్వామి పూజకు అందరూ ఏర్పాట్లు చేస్తారు. గురువుగారు వచ్చి ఏం చేయాలో అవి చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 31st - కృష్ణ ముకుంద మురారి సీరియల్: ముకుంద మీద ఆదర్శ్‌కి అనుమానం.. మురారికి షాక్ ఇచ్చిన కృష్ణ!