Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో రోజు (మంగళవారం, 30 ఏప్రిల్ 2024) కూడా సంతోషం కొనసాగింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US FED) 2 రోజుల సమావేశం నేపథ్యంలో అమెరికన్ మార్కెట్ల నుంచి గట్టి సపోర్ట్ లభించింది. ముఖ్యంగా డౌ జోన్స్ మద్దతుతో దేశీయ మార్కెట్లలో ఉత్సాహం కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లోనూ వేగం ఉంది. వాహన రంగం 1.5 శాతం పెరిగింది, మారుతి సుజుకి అద్భుతమైన ప్రదర్శన ఈ రంగాన్ని నడిపిస్తోంది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (సోమవారం) 74,671 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 129.61 పాయింట్లు లేదా 0.17 శాతం పెరుగుదలతో 74,800.89 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,643 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 6.25 పాయింట్లు లేదా 0.16 శాతం లాభంతో 22,679.65 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు సరికొత్త రికార్డ్ గరిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. 53.05 పాయింట్లు లేదా 0.11 శాతం లాభంతో 49,477 దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసింది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.34 శాతం చొప్పున పెరిగాయి.
ప్రారంభ ట్రేడింగ్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 19 స్టాక్స్ గ్రీన్ జోన్‌లో ట్రేడ్ అవుతుంటే, 11 స్టాక్స్ మాత్రమే క్షీణించాయి. సెన్సెక్స్‌లో ఆటో, రియాల్టీ స్టాక్స్ ఎక్కువ పెర్ఫార్మ్ చేశాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో... మారుతి సుజుకి, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో.. 34 షేర్లు బలపడగా, 16 షేర్లు బలహీనపడ్డాయి. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో 1.5 శాతం లాభంతో ముందంజలో ఉంది. నిఫ్టీ రియాల్టీ 0.75 శాతం పెరిగింది. బ్యాంక్, ఐటీ రంగాలు కుదేలయ్యాయి.
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, REC, హావెల్స్ ఇండియా, ఇండస్ టవర్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, ప్రోక్టర్ & గాంబుల్, సోనా BLW, స్టార్ హెల్త్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, వేదాంత్ ఫ్యాషన్స్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్, క్యాస్ట్రోల్ ఇండియా, ఇండియామార్ట్, నువోకో విస్టాస్ కార్ప్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, గ్రావిటా ఇండియా, సింఫనీ, నియోజెన్ కెమికల్స్, అదానీ టోటల్ గ్యాస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFCI.
ఈ రోజు ఉదయం 09.45 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 142.80 పాయింట్లు లేదా 0.19% పెరిగి 74,814.08 దగ్గర; NSE నిఫ్టీ 59.35 పాయింట్లు లేదా 0.26% పెరిగి 22,702.75 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో, ఈ ఉదయం.. నికాయ్ 1.6 శాతం లాభపడింది. హాంగ్ సెంగ్, కోస్పి 0.6 శాతం వరకు పెరిగాయి. ASX200 0.3 శాతం పచ్చగా ఉంది. స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే జపాన్ యెన్ విలువ సోమవారం 34 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడింది.
US ఫెడ్ సమావేశానికి ముందు, నిన్న, అమెరికన్ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఎస్&పి 500 0.32 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.35 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.38 శాతం పెరిగాయి. మంగళ, బుధ వారాల్లో యూఎస్ ఫెడ్ మీటింగ్ జరుగుతుంది.
యూఎస్ ఫెడ్ మీటింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.603 శాతం వద్ద ఉంది. గాజాలో సీజ్ ఫైర్ ప్రయత్నాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $88 వద్దకు చేరింది. యూఎస్ ఫెడ్ మీటింగ్ ఫోకస్‌లో ఉండడంతో గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు ఔన్సుకు $2,345 దగ్గరకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పైథాన్ బృందం మొత్తానికీ పొగబెట్టిన గూగుల్, ఒక్కరిని కూడా ఒదల్లేదు