Stock Market Today News in Telugu: భారత స్టాక్ మార్కెట్లలో ఈ రోజు (మంగళవారం, 28 నవంబర్‌ 2023) ఆరంభ శూరత్వం కనిపించింది. మూడు రోజుల సెలవుల తర్వాత ఓపెన్‌ అయిన మార్కెట్లు, ప్రారంభ ట్రేడ్‌లో పచ్చగా ప్రారంభమయ్యాయి. అయితే, బుల్స్‌ కంటే బేర్‌ బలం ఎక్కువగా ఉండడంతో ఆరంభ లాభాలు ఆవిరవుతున్నాయి. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శుక్రవారం, 24 నవంబర్‌ 2023) 65,970 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 66k మార్కును దాటింది, 94 పాయింట్లు లేదా లేదా 0.14 శాతం లాభంతో 66,064 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 19,795 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 50 పాయింట్లు లేదా 0.25 శాతం పెరిగి 19,845 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్ ప్రారంభంలో, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌లో 1,300కు పైగా రైజింగ్ స్టాక్స్ కనిపించగా, దాదాపు 250 వరకు పడిపోయాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ షేర్ల ర్యాలీ ఈ రోజు కూడా కొనసాగింది. మార్కెట్‌కు వీటి నుంచే మద్దతు లభిస్తోంది.


సెన్సెక్స్ & నిఫ్టీ షేర్ల పరిస్థితి
ఓపెనింగ్‌ సెషన్‌లో... సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 25 షేర్లు గ్రీన్‌ మార్క్‌తో ఉన్నాయి, కేవలం 5 మాత్రమే క్షీణతను చూస్తున్నాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లోని 38 పెరుగుతున్నాయి, మిగిలిన 12 రెడ్‌ జోన్‌లోకి వెళ్లాయి.


సెక్టోరల్ ఇండెక్స్ పరిస్థితి
నిఫ్టీ బ్యాంక్, FMCG, ప్రైవేట్ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు హరిత వర్ణంలో ట్రేడవుతున్నాయి. మెటల్ రంగం 1.06 శాతం, ఆయిల్ & గ్యాస్ 0.82 శాతం చొప్పున పెరిగాయి. మీడియా సెక్టార్‌లో 0.48 శాతం వృద్ధి కనిపించింది.


ఉదయం 10.30 గంటల సమయానికి, బీఎస్‌ఈ సెన్సెక్స్ 18 పాయింట్లు లేదా 0.027% పెరిగి 65,987.76 వద్ద; నిఫ్టీ 29 పాయింట్లు లేదా 0.15% పెరిగి 19,823.80 వద్ద ట్రేడవుతున్నాయి.  


ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లోనూ మార్కెట్లు ఫ్లాట్‌గానే ఉన్నాయి. మార్కెట్ ప్రారంభానికి ముందు, సెన్సెక్స్ 88.60 పాయింట్లు లేదా 0.13 శాతం పెరుగుదలతో 66058 స్థాయి వద్ద ట్రేడయింది. నిఫ్టీ 57.50 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో 19852 వద్ద నిలిచింది.


గ్లోబల్‌ మార్కెట్స్‌
గత వారంలో బుల్స్‌ ర్యాలీతో ఊపిరి పీల్చుకున్న అమెరికన్‌ మార్కెట్లు, నిన్న (సోమవారం) స్వల్ప నష్టాలతో ఎరుపు రంగులో ముగిశాయి. డౌ జోన్స్ మాత్రమే గ్రీన్‌లో ముగియగా, నాస్‌డాక్, S&P 500 సూచీలు ఎరుపు రంగులో క్లోజ్‌ అయ్యాయి. ఈ వారం.. ఫెడ్ చైర్మన్‌ ప్రసంగం, ద్రవ్యోల్బణం డేటాపై మార్కెట్ల దృష్టి ఉంటుంది.


ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే.. ఈ ఉదయం ఆసియా మార్కెట్లలో మిక్స్‌డ్‌ ట్రేడింగ్ కనిపించింది. జపాన్‌కు చెందిన నికాయ్‌, హాంకాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్‌ నష్టాల్లో ఉన్నాయి. కొరియాకు చెందిన కోస్పి స్వల్పంగా పుంజుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్‌ తీసుకుని ఈ పనులు ఎప్పుడూ చేయొద్దు, లాభం కంటే నష్టమే ఎక్కువ!