Stock Market News Today in Telugu: ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఈ రోజు (గురువారం, 28 మార్చి 2024) భారతీయ ఈక్విటీ మార్కెట్లు బలాన్ని ప్రదర్శించాయి. BSE సెన్సెక్స్ 73,600 దగ్గర, నిఫ్టీ 22,300 మార్క్ పైన కదులుతున్నాయి. ఈ వారంలో & ఈ నెలలో ఇదే చివరి ట్రేడింగ్ రోజు. రేపు గుడ్ ఫ్రైడే, తర్వాత శని & ఆదివారాల కారణంగా మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఈ రోజు చారిత్రాత్మక రోజు. నేటి నుంచి T+0 సెటిల్మెంట్ అమలువుతోంది. ప్రయోగాత్మకంగా, మొదట 25 కంపెనీల షేర్లు, కొన్ని బ్రోకింగ్ కంపెనీలకే ఈ అవకాశం కల్పించారు. మిగిలిన షేర్లకు T+1 సెటిల్‌మెంట్ అమలవుతుంది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (బుధవారం) 72,996 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 153.03 పాయింట్లు లేదా 0.21 శాతం పెరుగుదలతో 73,149.34 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. బుధవారం 22,124 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 39.95 పాయింట్లు లేదా 0.18 శాతం లాభంతో 22,163.60 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
మార్కెట్ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత, ఉదయం 9.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ దాదాపు 160 పాయింట్ల లాభంతో 72,630 పాయింట్ల ఎగువన ఉంది. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 22,058 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పెరిగాయి.
ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 20 స్టాక్స్ లాభపడగా, మిగిలిన 10 స్టాక్స్ క్షీణించాయి. సెన్సెక్స్ టాప్ గెయినర్స్‌లో.. బజాజ్ ట్విన్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 2.14 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.13 శాతం పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్ 1.51 శాతం, పవర్ గ్రిడ్ 1.18 శాతం, హీరో మోటోకార్ప్ 1.17 శాతం, ఎస్‌బీఐ 1.16 శాతం లాభపడ్డాయి. మరోవైపు... బజాజ్ ఆటో 1.14 శాతం పడిపోయింది. అపోలో హాస్పిటల్స్ 0.97 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.93 శాతం, బ్రిటానియా ఇండస్ట్రీస్ 0.91 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.72 శాతం, అదానీ పోర్ట్స్ 0.63 శాతం చొప్పున నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో 35 స్టాక్స్ లాభాలతో, 15 స్టాక్స్ పతనంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో... బజాజ్ ఫిన్‌సర్వ్ 2.64 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.34 శాతం పెరిగాయి. పవర్ గ్రిడ్ 1.63 శాతం, హీరో మోటోకార్ప్ 1.50 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.48 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు... అపోలో హాస్పిటల్స్ 0.84 శాతం, బ్రిటానియా 0.82, బజాజ్ ఆటో 0.83 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 0.74 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.70 శాతం పడిపోయాయి.
ప్రి-ఓపెనింగ్ మార్కెట్
ప్రి-ఓపెనింగ్‌లో, BSE సెన్సెక్స్ 117.70 పాయింట్లు లేదా 0.16 శాతం పెరిగి 73114 వద్ద ఉంటే, NSE నిఫ్టీ 182.05 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 22156 వద్ద ఉంది.
ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 592.41 పాయింట్లు లేదా 0.81% పెరిగి 73,588.72 దగ్గర; NSE నిఫ్టీ 142.15 పాయింట్లు లేదా 0.82% పెరిగి 22,305.70 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం, ఆసియా మార్కెట్లలో నికాయ్ 1.3 శాతం పడిపోయింది. కోస్పి, తైవాన్ 0.5 శాతం చొప్పున క్షీణించాయి. హాంగ్ సెంగ్, షాంఘై కూడా స్వల్పంగా ఎరుపు రంగులో ఉన్నాయి.
నిన్న, యుఎస్‌లో, బెంచ్‌మార్క్ సూచీలు 3 రోజుల వరుస నష్టాల బ్రేక్ చేశాయి. శుక్రవారం 'పర్సనల్ కన్‌జంప్షన్ ఎక్స్‌పెండీచర్' (PCE) ప్రైస్ ఇండెక్స్ డేటా వెల్లడికానున్న నేపథ్యంలో, చెప్పుకోదగిన లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్ 1 శాతానికి పైగా ర్యాలీ చేసింది. S&P 500 0.9 శాతం, నాస్‌డాక్ 0.5 శాతం లాభపడ్డాయి.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.21 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ మళ్లీ చెలరేగి, బ్యారెల్‌కు $86 పైకి చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి