Stock Market News Today in Telugu: సోమవారం నాడు హోలీ పండుగతో సహా వరుసగా మూడు రోజుల తర్వాత, ఈ రోజు (మంగళవారం, 26 మార్చి 2024) భారత స్టాక్ మార్కెట్లు భయాందోళనల మధ్య ప్రారంభమయ్యాయి. ఎలుగుబంట్ల బలంతో ఓలటాలిటీ ఇండెక్స్‌ VIX భారీగా పెరిగింది. 22,000 దిగువన ప్రారంభమైన నిఫ్టీ, ఆ స్థాయిపై పట్టు కోసం పోరాటం చేస్తోంది. సోమవారం మన మార్కెట్‌కు మాత్రమే సెలవు, మిగిలిన గ్లోబల్‌ మార్కెట్లు పని చేశాయి. నిన్న అమెరికన్ మార్కెట్లు క్షీణించాయి, ఆ ప్రభావం మన మార్కెట్‌ మీద కనిపించింది. ఈ రోజు ట్రేడింగ్‌లో, హెవీ వెయిట్స్‌ రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్ షేర్ల పతనం కూడా మార్కెట్‌లో బలహీనతకు కారణమైంది. నెగెటివ్‌ ఎఫెక్ట్‌ ఉన్నప్పటికీ, ఓపెనింగ్‌ సెషన్‌లో బెంచ్‌మార్క్‌లు స్ట్రీట్‌ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 72,832 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 434.97 పాయింట్లు లేదా 0.60 శాతం పతనంతో 72,396.97 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 22,097 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 148.85 పాయింట్లు లేదా 0.67 శాతం క్షీణతతో 21,947.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్ ప్రారంభమైన వెంటనే, నిమిషాల వ్యవధిలోనే, నిఫ్టీ 22,000 స్థాయిని దాటింది. ఉదయం 9.25 గంటలకు 28.90 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 22,067 స్థాయి వద్ద ట్రేడవుతోంది. 


బ్యాంక్ నిఫ్టీ 310.80 పాయింట్లు లేదా 0.66 శాతం తగ్గి 46,552 పైన ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీలో సగానికి పైగా షేర్లు బలహీనంగా ఉన్నాయి.


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.13 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.24 శాతం పెరిగాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 13 స్టాక్స్‌ లాభపడగా, మిగిలిన 17 స్టాక్స్‌ క్షీణించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో.. HCL టెక్, M&M, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ ఉన్నాయి. పవర్ గ్రిడ్, NTPC, మారుతి సుజుకి, భారతి ఎయిర్‌టెల్, టైటన్ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 22 షేర్లు లాభపడగా, 28 షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.6 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.3 శాతం పడిపోయాయి. నిఫ్టీ ఆటో, మెటల్ సూచీలు తలో 0.4 శాతం పెరిగాయి.


ఈ రోజు ఉదయం 10.10 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 306.37 పాయింట్లు లేదా 0.42% తగ్గి 72,525.57 దగ్గర; NSE నిఫ్టీ 84.40 పాయింట్లు లేదా 0.38% తగ్గి 22,012.35 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మార్కెట్లు ఈ ఉదయం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌లోని నికాయ్‌ 0.23 శాతం పెరిగి 40,506 స్థాయిల వద్దకు చేరింది. హాంకాంగ్‌లోని హాంగ్‌ సెంగ్‌ 1.02 శాతం జంప్‌ చేసింది. కొరియాలోని కోస్పి 1.41 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలోని ASX 200 రెడ్‌ జోన్‌లోకి జారిపోయింది.


నిన్న, USలోని మూడు ప్రధాన సూచీలు క్షీణించాయి. డౌ జోన్స్ 0.41 శాతం, S&P 500 0.31 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.27 శాతం నష్టపోయాయి.


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.238 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $87 పైకి చేరింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి