Stock Market News Today in Telugu: క్రిస్మస్ సెలవుల కారణంగా అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 26 డిసెంబర్ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. దీంతోపాటు, పెట్టుబడిదార్లు ఇయర్ ఎండ్ ప్రాఫిట్ బుకింగ్స్‌కు దిగారు. దీంతో మార్కెట్లు ఈ రోజు చాలా నీరసంగా ఉన్నాయి. ప్రస్తుతం, ఎలాంటి భారీ యాక్టివిటీస్ తీసుకోకుండా అటు బుల్స్, ఇటు బేర్స్ ఇద్దరూ సైలెంట్‌గా ఉన్నారు.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శుక్రవారం) 71,107 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 09 పాయింట్లు లేదా 0.01 శాతం తగ్గి 71,097.78 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శుక్రవారం 21,349 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 16 పాయింట్లు లేదా 0.08 శాతం పెరుగుదలతో 21,365.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
సెక్టార్ల వారీగా చూస్తే, ఓపెనింగ్ టైమ్‌లో, నిఫ్టీ ఐటీ 1 శాతం క్షీణించింది, నిఫ్టీ రియాల్టీ 0.04 శాతం డౌన్ అయింది. మిగిలిన సెక్టార్లు అన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టీ మీడియా ఇండెక్స్ 0.78 శాతం, మెటల్ ఇండెక్స్ 0.6 శాతం పెరిగాయి.
బ్రాడర్ మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా 0.42 శాతం & 0.38 శాతం చొప్పున పెరిగాయి.
నిఫ్టీ ప్యాక్‌లో... ఇన్ఫోసిస్ 2% పడిపోయి, నష్టాల లిస్ట్‌లో లీడింగ్‌లో ఉంది. UPL, టాటా కన్స్యూమర్, బ్రిటానియా ముందంజలో ఉన్నాయి.
ఇన్ఫోసిస్: ఓ గ్లోబల్ కంపెనీతో కుదరాల్సిన ఒప్పందం రద్దయింది, అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సదరు గ్లోబల్ కంపెనీ నిర్ణయించింది. దీంతో, ఓపెనింగ్ టైమ్‌లో ఇన్ఫోసిస్ షేర్లు 2 శాతం పడిపోయాయి.
అదానీ గ్రీన్: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)తో 1,799 మెగావాట్ల (MW) సౌర విద్యుత్‌ను సరఫరా చేయడానికి కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) కుదుర్చుకోవడంతో షేర్లు 2 శాతం పెరిగాయి.
పేటీఎం: ఖర్చులను తగ్గించుకోవడానికి 1,000 మంది ఉద్యోగులను తొలగించడంతో పేటీఎం స్టాక్ పడిపోయింది.
మీడియా ఆపరేషన్స్ విలీనానికి సంబంధించి, రిలయన్స్ ఇండస్ట్రీస్ - డిస్నీ ఇండియా కలిసి ఒప్పందంపై సంతకం చేసుకున్నాయన్న వార్తలతో నెట్‌వర్క్18 షేర్లు 5% పెరిగాయి.
ప్రి-ఓపెన్ సెషన్
ప్రి-ఓపెన్ సెషన్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్లాట్‌గా ఉన్నాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు తగ్గి 71,099 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 21,365 స్థాయి దగ్గర ఉంది.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 26.36 పాయింట్లు లేదా 0.037% తగ్గి 71,080.60 దగ్గర; NSE నిఫ్టీ 18.40 పాయింట్లు లేదా 0.086% పెరిగి 21,367.80 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
క్రిస్మస్ సెలవు కారణంగా, యూఎస్, యూరోప్ సహా గ్లోబల్ మార్కెట్లు సోమవారం క్లోజ్ అయ్యాయి. ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో ఆసియా మార్కెట్లు పెద్దగా మారలేదు. జపాన్ ఈక్విటీస్ బెంచ్‌మార్క్‌లు ఫ్లాట్‌గా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ స్కీమ్ గడువు పెంచిన ఎస్‌బీఐ