Stock Market News Today in Telugu: ఆసియా మార్కెట్ల నుంచి మద్దతు లభించడంతో ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ ఈ రోజు (శుక్రవారం, 26 ఏప్రిల్ 2024) మంచి ఓపెనింగ్స్ ఇచ్చాయి. దేశీయ మార్కెట్ వరుసగా ఆరో రోజూ బలం ప్రదర్శించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే, సెన్సెక్స్ దాదాపు 115 పాయింట్లు పెరిగింది. అయితే, ఈ లాభాలను నిలబెట్టుకోవడానికి స్టాక్ మార్కెట్ తంటాలు పడుతోంది.
ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (గురువారం) 74,339 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 170 పాయింట్ల జంప్‌తో 74,509.31 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. గురువారం 22,570 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 50 పాయింట్లు పెరిగి 22,620.40 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఉదయం 9.20 గంటలకు సెన్సెక్స్ దాదాపు 85 పాయింట్ల లాభంతో 74,430 పాయింట్ల దగ్గర, నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల పెరుగుదలతో 22,600 పాయింట్లకు చేరువలో ఉంది.
విస్తృత మార్కెట్లలో... BSE మిడ్ క్యాప్ 0.36 శాతం పెరిగింది & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.54 పెరిగింది.
సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ పచ్చగా ట్రేడవుతున్నాయి, మార్కెట్‌ను నడిపిస్తున్నాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో, ప్రారంభ ట్రేడింగ్‌లో, 20 స్టాక్స్ గ్రీన్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. టెక్ మహీంద్ర షేర్లు 11 శాతం పైగా పెరిగాయి. టాటా స్టీల్‌లో దాదాపు ఒకటిన్నర శాతం వృద్ధి కనిపించింది. HCL టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, JSW స్టీల్, సన్ ఫార్మా, NTPC, ITC, HDFC బ్యాంక్ కూడా లాభాల్లో ఉన్నాయి. మరోవైపు.. బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ ఎరుపు రంగులో ట్రేడవుతున్నాయి.
నిఫ్టీ50 ప్యాక్‌లో.. శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ టాప్ గెయినర్స్‌లో ఉండగా; ఐషర్ మోటార్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి.
ఈ రోజు ఉదయం 10.05 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 122.79 పాయింట్లు లేదా 0.17% తగ్గి 74,216.65 దగ్గర; NSE నిఫ్టీ 16.55 పాయింట్లు లేదా 0.07% తగ్గి 22,553.80 వద్ద ట్రేడవుతున్నాయి.
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: మారుతి సుజుకి, HCL టెక్నాలజీస్, SBI లైఫ్, బజాజ్ ఫిన్సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, SBI కార్డ్స్, సుప్రీం ఇండస్ట్రీస్, అతుల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ AMC, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, KSB, మహీంద్ర హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఉషా మార్టిన్, మాస్టెక్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా, VST ఇండస్ట్రీస్, ఫోర్స్ మోటార్స్.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో, ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్ 225 0.32 శాతం పెరిగింది, టోపిక్స్ ఇండెక్స్ 0.07 శాతం పైకి జరిగింది. దక్షిణ కొరియాలోని కోస్పి 0.86 శాతం ర్యాలీ చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన S&P/ASX 200 1.27 శాతం పడిపోయింది. హాంగ్‌కాంగ్‌లోని హ్యాం గ్‌సెంగ్ ఇండెక్స్ 1.15 శాతం లాభపడింది.
నిన్న వెల్లడైన US GDP డేటా నిరాశపరిచింది, అంచనాల కంటే తగ్గింది. మొదటి త్రైమాసికంలో 2.4 శాతం వృద్ధి ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తే, కేవలం ప్రకారం 1.6 శాతం వృద్ధి నమోదైంది. యూఎస్ డీజీపీ డేటా మార్కెట్ అంచనాలను మిస్ చేయడంతో అక్కడి మార్కెట్లు నిన్న పడిపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.98 శాతం నష్టపోయింది. S&P 500 0.46 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.64 శాతం తగ్గింది.
యూఎస్ GDP రిపోర్ట్ తర్వాత అమెరికన్ బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 5 నెలల గరిష్టానికి పెరిగింది, ప్రస్తుతం 4.70 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 1% జంప్ చేసి $89 పైకి చేరింది. గోల్డ్ కూడా రైజింగ్‌లో ఉంది, ఔన్సుకు $2,344 దగ్గరకు చేరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి