Stock Market News Today in Telugu: నిన్న (బుధవారం) అతి భారీ అస్థిరతకు గురైన ఇండియన్‌ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 25 జనవరి 2024) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, ఓలటాలిటీని కొనసాగిస్తున్నాయి. ఐటీ షేర్లలో ఎక్కువగా పతనం కనిపిస్తోంది, బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లను అవి కిందకు లాగుతున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (మంగళవారం) 71,060 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 38 పాయింట్ల దిగువన 71,022.10 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. మంగళవారం 21,454 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు ఫ్లాట్‌గా 21,454.60 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


బ్రాడర్‌ మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.11 శాతం & 0.46 శాతం వరకు లాభపడ్డాయి.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్‌లో... టెక్ మహీంద్ర, HCL టెక్, టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, విప్రో, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 5 శాతం వరకు క్షీణించి టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి. అదే సమయంలో.. లాభాల్లో ఉన్న NTPC, SBI షేర్లు ఇండెక్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 


నిఫ్టీలోనూ ఐటీ స్టాక్స్‌ ఎక్కువగా నష్టపోయాయి. టెక్ మహీంద్ర 4.70 శాతం, HCL టెక్ 1.80 శాతం, SBI లైఫ్‌ 1.02 శాతం, ఇన్ఫోసిస్‌ 0,82 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 0,80 శాతం క్షీణించాయి. మరోవైపు... కోల్‌ ఇండియా 1.39 శాతం, బ్రిటానియా 1.33 శాతం, NTPC 1.18 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.87 శాతం, BPCL 0,80 శాతం పెరిగాయి. 


ప్రభుత్వ రంగ సంస్థ మజగాన్‌ డాక్‌ షేర్‌ ధర 6 శాతం వరకు పెరిగింది.


సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 0.25 శాతం పతనమైంది. నిఫ్టీ రియల్టీ పుంజుకుని, 1.4 శాతం పెరిగింది.


ఈ రోజు ఉదయం 09.45 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 292.14 పాయింట్లు లేదా 0.41% క్షీణించి 70,768.17 దగ్గర; NSE నిఫ్టీ 66.80 పాయింట్లు లేదా 0.31% తగ్గి 21,387.15 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్ మార్కెట్లు
ఈ రోజు గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లకు మిశ్రమ సంకేతాలు అందాయి. నిన్న యుఎస్ మార్కెట్లు పతనంతో, ఇవాళ ఉదయం ఆసియాలోని ప్రధాన మార్కెట్లు స్థబ్దుగా ట్రేడయ్యాయి. తైవాన్ 0.5 శాతం, హాంగ్ సెంగ్ 0.2 శాతం పెరిగింది. నికాయ్‌, కోస్పీ 0.3 శాతం క్షీణించాయి. 


ఓవర్‌నైట్‌లో, యూఎస్‌ మార్కెట్లలో డౌ జోన్స్ 0.3 శాతం క్షీణించి, ఇంట్రా డే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాస్‌డాక్ 0.4 శాతం, S&P 500 0.1 శాతం లాభపడ్డాయి, 


US బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్‌ 4.176 శాతానికి పెరిగాయి. ఈ రోజు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) పాలసీ నిర్ణయాలను ప్రకటిస్తుంది. వడ్డీ రేట్లను ECB యథాతథంగా ఉంచుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి