IBPS SO Prelims Result 2023: ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో స్కోరుకార్డును అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థలు తమ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రూల్ నెంబరు, పాస్‌వర్డ్ లేదా పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు. జనవరి 28 వరకు స్కోరుకార్డు అందుబాటులో ఉండనుంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహించిన తుది ఎంపికచేస్తారు.


స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ప్రిలిమ్స్ స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీలు: 1402


1) అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 500 


బ్యాంకులవారీగా ఖాళీలు: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-400, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.


అర్హత: డిగ్రీ (అగ్రికల్చర్ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/ వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్/ ఫిషరీ సైన్స్/ పిసికల్చర్/అగ్రి మార్కెటింగ్ & కోఆపరేషన్/ కో-ఆపరేషన్ &బ్యాంకింగ్/ ఆగ్రో-ఫారెస్ట్రీ/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్/ డెయిరీ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ సెరికల్చర్/ఫిషరీస్ ఇంజినీరింగ్)


2) హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 31


బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-12, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-04.


అర్హత: పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా(పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్/ హెచ్‌ఆర్/ హెచ్‌ఆర్‌‌డీ/ సోషల్ వర్క్/ లేబర్ లా).


3) ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 120


బ్యాంకులవారీగా ఖాళీలు: ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-20, పంజాబ్ నేషనల్ బ్యాంక్-100.


అర్హత: బీటెక్/ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ ఐటీ).


4) లా ఆఫీసర్ (స్కేల్-1): 10


బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-10.


అర్హత: లా డిగ్రీ (ఎల్‌ఎల్‌బీ) ఉండాలి. బార్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.


5) మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-1): 700


బ్యాంకులవారీగా ఖాళీలు: పంజాబ్ నేషనల్ బ్యాంక్-700.


అర్హత: డిగ్రీతోపాటు రెండేళ్ల ఎంఎంఎస్ (మార్కెటింగ్)/ ఎంబీఏ(మార్కెటింగ్)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం.


6) రాజ్‌భాషా అధికారి (స్కేల్-1): 41


బ్యాంకులవారీగా ఖాళీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా-16, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-15, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్-10.


అర్హత: పీజీ డిగ్రీ (హిందీ/ సంస్కృతం). డిగ్రీ స్థాయిలో హిందీ/ సంస్కృతం తప్పనిసరి సబ్జెక్టుగా చదివి ఉండాలి.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.08.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.08.2023.


➥ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ (ప్రిలిమినరీ పరీక్ష): డిసెంబర్ 2023.


➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 30.12.2022/ 31.12.2023.


➥ ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: జనవరి, 2024.


➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి, 2024.


➥ ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేదీ: 28.01.2024.


➥ తుది పరీక్ష ఫలితాల ప్రకటన: ఫిబ్రవరి, 2024.


➥ ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి/ మార్చి 2024.


➥ ఇంటర్వ్యూ నిర్వహణ: ఫిబ్రవరి/ మార్చి, 2024.


➥ ప్రొవిజినల్ అలాట్‌మెంట్: ఏప్రిల్, 2024.


Notification


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..