Stock Market News Today in Telugu: సోమవారం సెలవు తీసుకున్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం, 23 జనవరి 2024) ఫుల్ జోష్‌లో ప్రారంభమయ్యాయి. కొన్ని కార్పొరేట్ కంపెనీల Q3 ఫలితాలు ఆశించిన దాని కంటే మెరుగ్గా ఉండడం, ఐటీ & ఫార్మా స్టాక్స్ పుంజుకోవడంతో ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫుల్ గ్రీన్ జోన్‌లో ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్‌లో, ICICI బ్యాంక్ షేర్లలో భారీ కొనుగోళ్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా మన మార్కెట్‌ను పెంచాయి. అమెరికన్ మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలను క్రియేట్ చేస్తున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
గత సెషన్‌లో (శనివారం) 71,423 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 446 పాయింట్లు లేదా 0.62 శాతం పెరుగుదలతో 71,868.20 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. శనివారం 21,571 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 145 పాయింట్లు లేదా 0.67 శాతం జంప్‌తో 21,716.70 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
బ్యాంక్ నిఫ్టీ 437 పాయింట్లు లేదా 0.95 శాతం భారీ గెయిన్స్‌తో 4649.40 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ ఐటీ ఈ రోజు కూడా పుంజుకుంది, 0.71 శాతం లాభంలో ఉంది. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 1.6 శాతం పెరిగింది. జీ-సోనీ దెబ్బకు నిఫ్టీ మీడియా ఇండెక్స్ 3 శాతానికి పైగా పడిపోయింది.
బ్రాడర్ మార్కెట్‌లో... BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం వరకు పెరిగాయి. మిడ్ క్యాప్ సూచీ మరోమారు రికార్డు గరిష్ట స్థాయికి చేరింది, 38,647ను టచ్ చేసింది.
ఓపెనింగ్ టైమ్‌లో, ICICI బ్యాంక్, NTPC, భారతి ఎయిర్‌టెల్, పవర్ గ్రిడ్, TCS, HCL, టెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్ర 3.5 శాతం వరకు ర్యాలీతో ముందు వరుసలో ఉన్నాయి.
సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా లిమిటెడ్, విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు టెర్మినేషన్ నోటీసు జారీ చేసింది. ఆ ఎఫెక్ట్‌తో జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో 10 శాతం పడిపోయాయి.
2023 డిసెంబర్ త్రైమాసికానికి మంచి నంబర్లు పోస్ట్ చేసిన సిప్లా షేర్లు 7 శాతం పెరిగాయి. Q3FY24లో ఈ ఫార్మా మేజర్ నికర లాభం 32 శాతం (YoY) పెరిగి రూ. 1,055.90 కోట్లకు చేరింది. ఆదాయం 13 శాతం పెరిగి రూ.6,505.66 కోట్లుగా నమోదైంది.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 555.39 పాయింట్లు లేదా 0.78% పెరిగి 71,979.04 దగ్గర; NSE నిఫ్టీ 156.20 పాయింట్లు లేదా 0.72% పెరిగి 21,728.00 వద్ద ట్రేడవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
వడ్డీ రేట్లపై బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో, మార్కెట్ ప్రారంభలో నికాయ్ 0.6 శాతం వరకు పెరిగింది. మిగిలిన ఆసియా మార్కెట్లలో.. హాంగ్ సెంగ్ కూడా 0.6 శాతం లాభపడగా, ASX200, కోస్పీ 0.46 శాతం వరకు పెరిగాయి. నిన్న, US మార్కెట్లలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P 500 కొత్త ఆల్-టైమ్ గరిష్టాలను చేరాయి. డౌ జోన్స్ 0.36 శాతం లాభపడగా, S&P500 0.22 శాతం పెరిగింది. టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.32 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి