Stock Market News Today in Telugu: NSE నిఫ్టీ ఈ రోజు (శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024) కూడా రికార్డ్‌ స్థాయిలో ప్రారంభమైంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ 50 తొలిసారిగా 22,290 స్థాయి వద్ద ప్రారంభమైంది. ఆ వెంటనే మరో 7 పాయింట్లు కూడగట్టుకుని పెరిగి 22,297.50 స్థాయికి చేరుకుంది, ఇది నిఫ్టీ ఆల్‌ టైమ్ గరిష్ట స్థాయి (Nifty At Record High). ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 22,300 మార్క్‌కు చేరువగా వెళ్లినప్పటికీ, ప్రస్తుతానికి ఆ స్థాయిని దాటలేకపోయింది. BSE సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరువైంది. ప్రారంభ నిమిషాల్లో 73,413.93 వరకు వెళ్లింది. సెన్సెక్స్‌ ఆల్ టైమ్ హై లెవెల్ (Sensex all time high) 73,427.59. ఈ రోజు ఈ స్థాయిని సెన్సెక్స్‌ దాటుతుందని భావిస్తున్నారు.


ఎన్‌విడియా త్రైమాసిక ఫలితాల ఉత్సాహాన్ని టెక్‌ స్టాక్స్‌ ఈ రోజు కూడా కొనసాగించాయి, ఓవరాల్‌ మార్కెట్‌కు దన్నుగా నిలిచాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 73,158 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 236.20 పాయింట్లు లేదా 0.32 శాతం పెరిగి 73,394.44 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 22,217 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 72.55 పాయింట్లు లేదా 0.33 శాతం పెరుగుదలతో 22,290 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం & స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.5 శాతం చొప్పున పెరిగాయి.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో, సెన్సెక్స్‌లో.. టైటన్‌, టెక్‌ మహీంద్ర, JSW స్టీల్‌ ముందంజలో ఉన్నాయి. 


నిఫ్టీ 50 ప్యాక్‌లో.. 29 లాభాలతో, 20 పతనంతో ట్రేడవుతున్నాయి. ఒక్క స్టాక్ మాత్రమే ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతోంది. హీరో, గ్రాసిమ్‌ షేర్లు నిఫ్టీ టాప్‌ గెయినర్స్‌లో ఉండగా, ఎయిర్‌టెల్‌, ఏసియన్ పెయింట్స్‌ లూజర్స్‌గా నిలిచాయి.


ఈ రోజు మార్కెట్ ప్రారంభమైన వెంటనే, బ్యాంక్ నిఫ్టీ 47,135 స్థాయికి చేరుకుంది. ఈ ఇండెక్స్‌లోని 12 షేర్లలో 10 షేర్లు పచ్చగా ఉన్నాయి. 


ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 91.62  పాయింట్లు లేదా 0.13% పెరిగి 73,249.87 దగ్గర; NSE నిఫ్టీ 24.65 పాయింట్లు లేదా 0.11% పెరిగి 22,242.10 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ప్రారంభ సెషన్‌లో ఆస్ట్రేలియా ASX200, దక్షిణ కొరియా యొక్క కోస్పి, హాంగ్‌ కాంగ్ హ్యాంగ్ సెంగ్, చైనా షాంఘై కాంపోజిట్ 0.5 శాతం నుంచి 0.7 శాతం వరకు లాభపడ్డాయి. పబ్లిక్‌ హాలిడే కారణంగా జపాన్‌ నికాయ్‌ ఈ రోజు పని చేయదు. 


యూఎస్‌ మార్కెట్లు నిన్న విపరీతంగా లాభపడ్డాయి. చిప్ దిగ్గజం ఎన్‌విడియా అద్భుతమైన త్రైమాసిక ఫలితాలను పోస్ట్ చేయడంతో, S&P 500 రికార్డు స్థాయికి చేరుకుంది, ఇది టెక్ సెక్టార్‌ను అమాంతం పెంచింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ 2.11 శాతం పెరిగి 5,087.03 వద్ద ముగిసింది, 2023 జనవరి తర్వాత, ఒక రోజు గరిష్ట లాభం ఇది. నాస్‌డాక్ కాంపోజిట్ 2.96 శాతం ఎగబాకింది, 2023 ఫిబ్రవరి తర్వాత అత్యుత్తమ ఇంట్రాడేను చూసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.18 శాతం లాభపడి, మొదటిసారిగా 39,000 పైకి చేరింది, కొత్త గరిష్ట స్థాయి 39,069.11 వద్ద ముగిసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే