Jagadhatri Serial Today Episode: అందరూ జైలుకు వెళ్లి సుధాకర్‌ను కలుస్తారు. అయితే అందరూ మాట్లాడుతుంటే ధాత్రి మాత్రం సుధాకర్ పెదవికి గాయం అవ్వడం గమనించి పెదవికి ఏమైందని అడుగుతుంది. దీంతో సుధాకర్ తో సహా అందరూ షాక్ అవుతారు. సుధాకర్ తనను ఎవరో కొట్టింది గుర్తు చేసుకుని బయటకు మాత్రం నన్ను ఎవరూ ఏమీ అనలేదని బాత్రూం డోర్ తగిలిందని అబద్దం చెప్తాడు. అయితే సుధాకర్ చెప్పిన అబద్దాన్ని ధాత్రి పసిగడుతుంది. వెంటనే లోపల ఏమైందని అడుగుతుంది. మీ మీద ఎవరు చేయి చేసుకున్నారు అంటూ ప్రశ్నించడంతో సుధాకర్ షాక్ అవుతాడు. ఇంతలో సెంట్రీ వచ్చి సార్ టైం అవుతుంది అనగానే కేదార్ సార్‌కు ఆ దెబ్బ ఎలా తగిలింది అని అడగ్గానే పొద్దునే ఆ సూరి వాళ్లతో గొడవ జరిగినట్లుంది. అప్పుడే ఆ దెబ్బ తగిలినట్లుంది అని చెప్తాడు.
ధాత్రి: మామయ్యా గారు ఫ్లీజ్ జరిగిందేంటో చెప్పండి.
సుధాకర్: ఇందాకా ముఖం కడుకుందామని వెళ్లినప్పుడు..
అంటూ లోపల రౌడీలతో జరిగిన గొడవ గురించి చెప్తాడు. రౌడీలు తనను కొట్టిన విషయం చెప్పగానే అందరూ బాధపడతారు. కేదార్, యువరాజ్ ఆవేశంగా జైలు లోపలికి వెళ్తారు. జైలర్‌తో సుధాకర్ గారిని కొట్టింది ఎవరని అడుగుతారు. దూరం నుంచి గమనిస్తున్న రౌడీలు కేదార్, యువరాజ్ లను రెచ్చగొట్టడంతో యువరాజ్ ఆవేశంగా సూరి వైపు వెళ్లడంతో దగ్గరకు వచ్చిన యువరాజ్‌ను గుర్తు పట్టిన సూరి నువ్విక్కడున్నావేంటి? అని అడుగుతాడు. ఆయన మా నాన్న అని చెప్పి వెళ్లిపోతాడు. సూరి, కేదార్‌ను చూసి సుధాకర్‌ను చంపేస్తాం అన్నట్లు సైగ చేస్తాడు. దీంతో ఆవేశంగా కేదార్ రౌడీల మీదకు వెళ్లి కొడతాడు. ఇంకోసారి మా నాన్న వైపు చూసినా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు కేదార్.
ధాత్రి: నిన్నెప్పుడూ ఇంత కోపంగా చూడలేదు కేదార్.
కేదార్: నాన్న రక్తాన్ని కళ్ల చూశాడు ధాత్రి వాడు. ఏదో ఒకటి చేసి నాన్నని బయటకి తీసుకురావాలి. మినిస్టర్‌ను ఎవరు మర్డర్ చేశారో త్వరగా కనుక్కోవాలి. వాడు నాన్నతో ప్రవర్తించిన తీరు తలుచుకుంటుంటే కోపం పెరిగిపోతుంది ధాత్రి.
ధాత్రి: ఒక కొడుకుగా నీకు కోపం రావడం కరెక్టే కానీ నువ్వు ఆ జైలర్‌ను లెక్క చేయకుండా వెళ్లి సూరిని కొట్టడం తప్పు కేదార్. మామయ్య గారిని అలా చూస్తుంటే నాక్కూడా కోపం వస్తుంది. కానీ మనం పోలీసులమే కదా వాళ్ల డ్యూటీ వాళ్లని చేయనివ్వాలి. ఇప్పుడు మామయ్య గారు ఆ సూరి వాళ్ల మధ్యలోనే ఉండాలి. ప్రాబ్లమ్ వస్తే పరిష్కరించుకోవాలి కానీ పెద్దది చేసుకోకూడదు కేదార్. నాకు తెలిసి నువ్వు కొట్టిందానికి ఆ సూరి మామయ్య గారి జోలికైతే రాడు. కానీ ఎందుకైనా మంచిది నువ్వు సాధు గారితో మాట్లాడి జైలర్ గారితో మాట్లాడమని చెప్పు.
కేదార్: సరే ధాత్రి
ధాత్రి: పద మనం ఇంటికి వెళ్లాలి.
అని ఇద్దరూ వెళ్లబోతుంటే జైలు గార్డుకు మీనన్ మనిషి ఒక పార్శిల్ ఇస్తాడు. వాళ్లను గమనించిన కేదార్. ధాత్రి వాడు నీకు తెలుసా అని అడగ్గానే తెలియదు అంటుంది ధాత్రి. నాకు ప్రేమగా బాంబు గిఫ్ట్ గా ఇచ్చినవాడు అని కేదార్ చెప్పగానే ధాత్రి షాక్ అవుతుంది. వెంటనే వెళ్లి వాణ్ని పట్టుకుని కొట్టడంతో వాడు బాంబు పెట్టమని చెప్పింది యువరాజ్ అని చెప్తాడు. దీంతో ఆవేశంగా ధాత్రి యువరాజ్ దగ్గరకు వచ్చి బాంబు ఉన్న గిఫ్ట్ కేదార్‌కు పంపించింది నువ్వేనా అని అడుగుతుంది. లేదని యువరాజ్ చెప్పగానే ధాత్రి కోపంగా యువరాజ్‌ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: వ్యూహం మళ్లీ వాయిదా - కానీ, ఈసారి లోకేష్ కారణం కాదు..