Stock Market News Today in Telugu: ఈ రోజు (గురువారం, 21 మార్చి 2024) భారత స్టాక్ మార్కెట్‌ బలంగా ప్రారంభమైంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్, తన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకపోవడంతో ఆసియా-పసిఫిక్‌, అమెరికన్ మార్కెట్లు పచ్చగా కళకళలాడాయి. ఈ మార్కెట్ల మీదుగా వీచిన సానుకూల పవనాలతో దేశీయ మార్కెట్‌లోనూ ఉల్లాసం కనిపించింది. బిజినెస్‌ ప్రారంభమైన వెంటనే నిఫ్టీ 22,000 స్థాయిన దాటగా, సెన్సెక్స్ 500 పాయింట్లు ఎగబాకింది. యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయాల కారణంగా బంగారం కూడా ఈ రోజు రికార్డు స్థాయిలో ప్రారంభమైంది. 


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (బుధవారం) 72,102 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 405.67 పాయింట్లు లేదా 0.56 శాతం పెరుగుదలతో 72,507.36 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 21,839 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 150.80 పాయింట్లు లేదా 0.69 శాతం పెరుగుదలతో 21,989.90 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మార్కెట్ ప్రారంభమైన వెంటనే, నిమిషాల్లోనే, NSE నిఫ్టీ 165 పాయింట్లు లేదా 0.76 శాతం పెరిగి 22,004 వద్దకు చేరుకోగా, BSE సెన్సెక్స్ 575 పాయింట్లు లేదా 0.80 శాతం పెరిగి 72,677 స్థాయికి చేరుకుంది.


విస్తృత మార్కెట్లలో, BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 1.4 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ 1.3 శాతం పుంజుకున్నాయి.


ప్రారంభ సెషన్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 28 స్టాక్స్‌ లాభపడగా, మిగిలిన 2 స్టాక్స్‌ క్షీణించాయి. సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో.. ఇండస్‌ఇండ్ బ్యాంక్, విప్రో, టాటా స్టీల్, టాటా మోటార్స్, NTPC, పవర్‌గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, SBI ఉన్నాయి. టాప్‌ లూజర్స్‌లో.. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, KEI ఇండస్ట్రీస్ టాప్ లూజర్‌గా ఉన్నాయి.


BSE మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 378.05 లక్షల కోట్లకు చేరుకుంది. ట్రేడ్‌ ప్రారంభంలో, BSEలో 2,273 షేర్లు ట్రేడ్ అవుతుండగా.. వాటిలో 1,831 షేర్లు పురోగమించాయి, 336 షేర్లు తిరోగమించాయి. 106 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 86 షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో,  40 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో ఆగిపోయాయి.


నిఫ్టీ 50 ప్యాక్‌లో 43 షేర్లు లాభపడగా, 7 షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లో, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 1.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.62 శాతం, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 0.48 శాతం, నిఫ్టీ మెటల్ 2.21 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.67 శాతం లాభపడ్డాయి.


ఈ రోజు ఉదయం 10.00 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 535.98 పాయింట్లు లేదా 0.74% పెరిగి 72,637.67 దగ్గర; NSE నిఫ్టీ 169.10 పాయింట్లు లేదా 0.77% పెరిగి 22,008.20 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
యూఎస్‌ ఫెడ్ తన వడ్డీ రేట్లను మరోమారు యథాతథంగా ఉంచింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మూడుసార్లు రేట్ల కోత ఉంటుదన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ వార్తలతో ఆసియా పసిఫిక్‌లో మార్కెట్లు భారీగా పెరిగాయి. ఆసియా మార్కెట్లలో.. జపాన్‌ నికాయ్‌ 1.57 శాతం ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, టోపిక్స్ కూడా 1.41 శాతం ఎగబాకి కొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణ కొరియా కోస్పి 1.52 శాతం పెరిగింది, 2022 ఏప్రిల్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. కోస్‌డాక్ 1.48 శాతం పెరిగింది. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా 1.51 శాతం పెరిగి 16,793 స్థాయిలో ట్రేడ్‌ అవుతోంది.


అమెరికాలో, నిన్న, మూడు ప్రధాన ఇండెక్స్‌లు లాభాలను చవిచూశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ & S&P 500 వరుసగా 1.03 శాతం & 0.89 శాతం పెరిగి కొత్త రికార్డు గరిష్టాలను నెలకొల్పాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 1.25 శాతం జంప్‌ చేసింది, లార్జ్‌ క్యాప్ టెక్నాలజీ స్టాక్స్‌ ఇచ్చిన బూస్ట్‌తో ఇది బలం పెంచుకుంది.


యూఎస్‌ ఫెడ్‌ నిర్ణయాల తర్వాత, అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.259 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ కూడా పడిపోయి, బ్యారెల్‌కు $86 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి