Stock Market News Today in Telugu: స్టాక్ మార్కెట్‌లో, తొలిసారిగా, శనివారం రోజున ట్రేడింగ్‌ జరుగుతోంది. ఇది ఆకస్మిక ట్రేడింగ్‌. మార్కెట్లలో ఏర్పడే సాంకేతిక ఇబ్బందులకు పరిష్కారాలు వెదికేందుకు, శనివారం రోజున మాక్‌ డ్రిల్‌లా కొద్దిసేపు ట్రేడింగ్‌ చేపట్టాలని గతంలో నిర్ణయించిన స్టాక్‌ మార్కెట్లు, అనూహ్యంగా నిర్ణయాన్ని మార్చుకున్నాయి. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు యథాతథంగా మార్కెట్‌ను నడపాలని శుక్రవారం రాత్రి నిర్ణయించాయి. దీనికి బదులుగా, అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం జరిగే సోమవారం (22 జనవరి 2024) రోజును సెలవుగా ప్రకటించాయి.


ఇండియన్‌ మార్కెట్లలో శనివారం నాటి ట్రేడింగ్‌ మంచి ఊపుతో ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం దీనికి ప్రధాన కారణం. అమెరికన్ మార్కెట్లు ఇప్పుడు ఆల్-టైమ్ హై రేంజ్‌లో నడుస్తున్నాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (శుక్రవారం) 71,773.26 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 325.07 పాయింట్లు లేదా 0.45 శాతం పెరుగుదలతో 72,008 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 21,659.50 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 83 పాయింట్ల పెరుగుదలతో 21,706 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


మరోసారి రికార్డు స్థాయికి మిడ్‌ క్యాప్ ఇండెక్స్   
బ్రాడర్‌ మార్కెట్‌లో... BSE మిడ్‌ క్యాప్‌ సూచీ 0.6 శాతం, స్మాల్‌ క్యాప్‌ సూచీ 0.6 శాతం చొప్పున పెరిగాయి. మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌లో అద్భుతమైన ర్యాలీ కొనసాగుతోంది. దేశీయ మార్కెట్‌లో సూపర్‌ మొమెంటంతో... సెన్సెక్స్, నిఫ్టీతో పాటు మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ కూడా పుంజుకుంది. 


ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో పవర్ గ్రిడ్, NTPC, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, SBI, సన్ ఫార్మా, టైటన్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు.. HUL 2 శాతం క్షీణించింది, రిలయన్స్ 0.35 శాతం నష్టపోయింది.


NSEలో, 1612 షేర్లు గ్రీన్‌ జోన్‌లో ఉంటే, 194 షేర్లు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి.


మార్కెట్‌ ప్రారంభ సమయంలో... డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 0.56 శాతం పెరిగింది, ఆ తర్వాత తగ్గింది. HUL షేర్లు 2.28 శాతం భారీ పతనంతో రూ.2507 స్థాయిలో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ప్యాక్‌లో ఉన్న లార్జ్‌ క్యాప్‌ షేర్లలో ఇది ఒకటి. డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ స్టాక్‌ 1 శాతం పైగా పడిపోయింది.


రైల్వే షేర్ల విపరీతమైన ర్యాలీ ఈ రోజు కూడా కొనసాగింది. IRCTC, RVNL వంటి షేర్లు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఈ రోజు మళ్లీ 8.50 శాతం భారీ జంప్‌తో ఒక్కో షేరు రూ. 316 వద్దకు చేరింది. IRFC కూడా 8 శాతం బలమైన వృద్ధితో ట్రేడవుతోంది. రైల్‌టెల్ 4.50 శాతం జంప్ చేసి రూ. 404 పైకి చేరింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి