Stock Market News Today in Telugu: భారత స్టాక్ మార్కెట్‌లో దీపావళి కంటిన్యూ అవుతూనే ఉంది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో, BSE సెన్సెక్స్‌ & NSE నిఫ్టీ ఈ రోజు (బుధవారం, 20 డిసెంబర్‌ 2023) మళ్లీ రికార్డ్‌ స్థాయిలో (Stock markets at record levels) ఓపెన్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 48,000 మార్క్‌ను దాటింది. డోమ్స్‌, ఇండియా షెల్టర్ హోమ్‌ షేర్లు ఈ రోజు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (మంగళవారం) 71,437 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 210.47 పాయింట్లు లేదా 0.29 శాతం లాభంతో 71,647 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. ఇది సెన్సెక్స్‌ కొత్త రికార్డు గరిష్టం. ఓపెనింగ్‌ తర్వాత కూడా కొత్త ఎత్తులు వెదుక్కుంటూ పైకి కదిలింది. గత సెషన్‌లో 21,453 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 90.40 పాయింట్లు లేదా 0.42 శాతం బలమైన పెరుగుదలతో 21,543 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. నిఫ్టీ కూడా ఇప్పుడు సరికొత్త జీవిత గరిష్టంలో ఉంది.


బ్యాంక్ నిఫ్టీ సంచలనం
ఈ రోజు బ్యాంక్‌ నిఫ్టీ మరో చారిత్రాత్మక స్థాయికి చేరింది, 48,000 మైలురాయిని దాటింది. ఈ ఇండెక్స్‌ కూడా ఇప్పుడు సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది.


ప్రి-ఓపెన్‌ సెషన్‌
స్టాక్ మార్కెట్ ప్రి ఓపెనింగ్‌ సెషన్‌లోనే స్టాక్‌ మార్కెట్‌ రికార్డులు బద్ధలయ్యే సూచనలు కనిపించాయి. నిఫ్టీ 89.75 పాయింట్లు లేదా 0.42 శాతం పెరిగి 21,542 వద్ద ఉంటే, సెన్సెక్స్ 271.36 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 71,7085 వద్ద ట్రేడయింది. 


సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో.. రిలయన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.


ఐటీ ప్యాక్‌లో... టెక్ మహీంద్రా 2 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా 1 శాతానికి పైగా లాభపడ్డాయి. 


ఆఫ్రికన్ బెవ్‌కో ఫ్రాంచైజీని కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్న వరుణ్ బెవరేజెస్ షేర్లు 10% పెరిగాయి. 


ఇండస్‌ఇండ్ బ్యాంక్, నిప్పాన్‌ ఏఎంసీలో 1.79 కోట్ల షేర్లు/2.86 శాత వాటా విక్రయిస్తుందన్న వార్తలతో నిప్పాన్ AMC స్టాక్‌ 7% పెరిగింది


ఎంబసీ REIT నుంచి బ్లాక్‌స్టోన్ నిష్క్రమించాలని చూస్తోందని రిపోర్ట్స్‌ రావడంతో ఎంబసీ REIT షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. 


డెరివేటివ్ స్టాక్స్‌లో మరో 15% మార్జిన్ విధించడంతో BSE షేర్లు 2% పెరిగాయి. 


ముంబయికి చెందిన బిజినెస్‌ కపుల్‌ 19% వాటా కోసం రూ. 1,100 కోట్ల పెట్టుబడి పెడుతుందనన్న నివేదికలతో స్పైస్‌జెట్ 2% పెరిగింది.


ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 413.63 పాయింట్లు లేదా 0.58% పెరిగి 71,850.82 దగ్గర; NSE నిఫ్టీ 125.90 పాయింట్లు లేదా 0.59% లాభంతో 21,579 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ సమయానికి, సెన్సెక్స్‌ జీవిత కాల గరిష్టం ‍(Sensex fresh all-time high) 71,913.07 కాగా, నిఫ్టీ లైఫ్‌ టైమ్‌ హై (Nifty fresh all-time high) 21,593 గా ఉంది.


2024లో, బెంచ్‌మార్క్ సూచీలు మరో 8-10 శాతం లాభాలు అందిస్తాయని బ్రోకరేజ్ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఆశిస్తోంది.


గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ఫెడ్ రేట్-కట్ సంతోషం అమెరికన్‌ మార్కెట్లలో ఇంకా కొనసాగుతోంది. ఓవర్‌ నైట్‌లో, యూఎస్‌ మార్కెట్లు గ్రీన్ జోన్‌లో ముగిశాయి. డౌ జోన్స్‌,  S&P 500, నాస్‌డాక్ కాంపోజిట్ 0.68 వరకు లాభపడ్డాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తన పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడంతో ఈ రోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. నికాయ్‌ 1.6 శాతం జంప్‌ చేసింది. హాంగ్ సెంగ్, కోస్పి కూడా 1 శాతం చొప్పున పెరిగాయి. ఆస్ట్రేలియా S&P/ASX 200 0.5 శాతం గెయిన్స్‌లో ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి