Stock Market News Today in Telugu: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం, 19 డిసెంబర్ 2023) పాజిటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, నెస్లే 1 శాతం పైగా పెరిగాయి, మార్కెట్‌ను కిక్ స్టార్ట్ చేశాయి. అయితే, ఓపెనింగ్ గెయిన్స్ నిమిషాల్లోనే ఆవిరయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడంతో, ఓపెనింగ్ సెషన్‌లో మన మార్కెట్‌లో అనిశ్చితి కనిపించింది.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది...
నిన్న (సోమవారం) 71,315 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 164.19 పాయింట్లు లేదా 0.23 శాతం లాభంతో 71,479 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. అయితే, వెంటనే ఎరుపు రంగులోకి జారిపోయింది. గత సెషన్‌లో 21,419 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 59 పాయింట్లు లేదా 0.28 శాతం పెరుగుదలతో 21,477 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. అక్కడి నుంచి కిందకు జారుతూ వచ్చి 21,400 స్థాయి దగ్గర కాసేపు పోరాడినా, ఆ స్థాయిలోనూ నిలదొక్కుకోలేదు.
సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో... స్టాక్ స్ల్పిట్‌కు 2024 జనవరి 05ను రికార్డ్ డేట్ ప్రకటించిన నెస్లే ఇండియా 1.5 శాతం లాభపడింది. ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ITC టాప్ గెయినర్స్‌లో ఉన్నాయి. మరోవైపు, TCS, ఇండస్ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్, మహీంద్ర & మహీంద్ర, ఏషియన్ పెయింట్స్ టాప్ లూజర్స్ లిస్ట్‌లో కనిపించాయి.
వేదాంత, సైమెన్స్ ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉన్నాయి. వేదాంత, ఒక్కో షేరుకు రూ.11 డివిడెండ్‌కు ప్రకటించింది. దీంతో, మార్కెట్ ఓపెనింగ్ టైమ్‌లో ఈ స్టాక్ 2 శాతానికి పైగా లాభపడింది. సైమెన్స్, తన ఇంధన వ్యాపారాన్ని విడదీసి, ప్రత్యేక కంపెనీగా మార్చడానికి చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సిమెన్స్ షేర్లు దాదాపు ఒక శాతం పెరిగాయి.
బ్రాడర్ మార్కెట్‌లో మిడ్ & స్మాల్ క్యాప్స్ జోరు కంటిన్యూ అవుతోంది. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.1 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం లాభపడింది.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 147.46 పాయింట్లు లేదా 0.21% తగ్గి 71,167.63 దగ్గర; NSE నిఫ్టీ 43.40 పాయింట్లు లేదా 0.20% నష్టంతో 21,375.25 వద్ద ట్రేడవుతున్నాయి.
బలంగా ఉన్న భారతదేశ ఆర్థిక డేటా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ ఆదాయాలు, పెరిగిన FII ఇన్‌ఫ్లోస్ కారణంగా ఓవరాల్ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. అయితే, ఇటీవలి బలమైన ర్యాలీని దృష్టిలో పెట్టుకుని, షార్ట్‌టైమ్‌లో కొంత అస్థిరత కనిపించొచ్చని చెబుతోంది.
గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి
2024లో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశావాదాన్ని యూఎస్ మార్కెట్లు సోమవారం సెషన్‌లోనూ కొనసాగించాయి, లాభాలు అందుకుని క్లోజ్ అయ్యాయి. S&P 500, నాస్‌డాక్ 0.5 శాతం చొప్పున లాభపడగా, డౌ జోన్స్ పెద్దగా మారలేదు. 2023లో, బ్యాంక్ ఆఫ్ జపాన్ తుది వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో, ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో ఆసియా మార్కెట్లు లోయర్ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్, హాంగ్ సెంగ్, కోస్పి 0.06-1 శాతం వరకు క్షీణించాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి