Stock Market News Today in Telugu: గ్లోబల్‌ మార్కెట్ల మూడ్‌ బాగోలేకేపోయినప్పటికీ, ఆటో స్టాక్స్‌ స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం, 17 మే 2024) సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే, గట్టి ట్రిగ్గర్లు లేకపోవడంతో, మార్కెట్‌ ఓపెనింగ్‌ తర్వాత హైడ్‌లైన్‌ ఇండెక్స్‌లు BSE సెన్సెక్స్‌ & NSE నిఫ్టీ దిగజారడం ప్రారంభించాయి. బ్యాంక్ నిఫ్టీ క్షీణిస్తోంది. ఎఫ్‌ఎంసీజీ షేర్లు కూడా లోయర్‌ సైడ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. మిడ్‌ & స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు మాత్రం ప్రతికూలతలను తట్టుకుని గట్టిగా నిలబడ్డాయి. M&M 7%, కేన్స్‌ టెక్‌ 11% జూమ్‌ అయ్యాయి.


ఈ రోజు మన మార్కెట్ ఇలా ప్రారంభమైంది...


గత సెషన్‌లో (గురువారం) 73,663 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 47.59 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 73,711.31 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 22,403 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 11.40 పాయింట్ల లాభంతో 22,415.25 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


విస్తృత మార్కెట్లలో... BSE మిడ్‌ క్యాప్ ఇండెక్స్‌ 0.4 శాతం, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌ కూడా 0.4 శాతం చొప్పున పెరిగాయి.


మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్స్‌లో... M&M ముందంజలో ఉంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, SBI, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ దానిని అనుసరిస్తున్నాయి. మరోవైపు... యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యుఎల్ నష్టాల్లో కనిపించాయి.


రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.4 శాతం క్షీణించింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.3 శాతం స్పిల్‌ అయింది. మరోవైపు... నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.5 శాతం ర్యాలీ చేసింది.


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: JSW స్టీల్, జైడస్ లైఫ్‌సైన్సెస్, NHPC, ఆస్ట్రల్, రైల్ వికాస్ నిగమ్, ఫీనిక్స్ మిల్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, గ్లోబల్ హెల్త్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటిక్, డెలివెరీ, బంధన్ బ్యాంక్, ఫైజర్, వినతి ఆర్గానిక్స్, పాలీ మెడిక్యూర్, శోభా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, వర్రోక్ ఇంజినీరింగ్, కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్, బల్రామ్‌పూర్ చినీ మిల్స్, ధనుకా అగ్రిటెక్, సుదర్శన్ కెమికల్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, షిప్పింగ్ కార్ప్ ఆఫ్ ఇండియా.


ఈ రోజు ఉదయం 09.55 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 47.80 పాయింట్లు లేదా 0.06% తగ్గి 73,615.92 దగ్గర; NSE నిఫ్టీ 22.75 పాయింట్లు లేదా 0.1% తగ్గి 22,381.10 వద్ద ట్రేడవుతున్నాయి. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, కొరియాకు చెందిన కోస్పి 0.6 శాతం క్షీణించగా, జపాన్‌కు చెందిన నికాయ్‌, ఆస్ట్రేలియాకు చెందిన ASX200 ఇండెక్స్‌ 0.5 శాతం చొప్పున తగ్గాయి. 
 
యుఎస్‌లో, నిన్న, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మొదటిసారి 40,000 మార్క్‌ను దాటింది, ఆ తర్వాత  0.1 శాతం క్షీణించింది. S&P 500 ఇండెక్స్‌ 0.21 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.26 శాతం తగ్గింది.


అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.369 శాతానికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83.59 వద్ద ఉంది. చేరింది. డాలర్‌ బలపడడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు ఒక అడుగు వెనక్కు వేసింది, ఔన్సుకు $2,382 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి